మెగా హిట్ మరో ఛాన్స్ తెచ్చింది..!

మెగా ఫ్యామిలీలో ఓ హిట్ కొడితే ఆ దర్శకుడికి లక్కీ ఛాన్సెస్ వస్తుంటాయి.తాజాగా అల్లు శిరీష్ కు కెరియర్ లో మెమరబుల్ హిట్ ఇచ్చిన డైరక్టర్ పరశురాం కూడా అంతే వచ్చిన అవకాశాన్ని అన్ని విధాలుగా వినియోగించుకున్న ఈ దర్శకుడు ఫలితం శ్రీరస్తు శుభమస్తు హిట్ అందుకున్నాడు.

 Mega Hit Gave Lucky Chance To Director-TeluguStop.com

అల్లు శిరీష్ ను అందరికి నచ్చేలా చేసిన పరశురాం ప్రతిభ నచ్చిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇప్పుడు ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరో కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వారే అంటున్నారు.

ఆంజనేయులు, యువత, సోలో, సారొచ్చారు సినిమాలతో దర్శకుడిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసిన పరశురాం శ్రీరస్తు శుభమస్తు హిట్ తో మెగా దర్శకుడయ్యాడు.ఇక చేయబోయే తర్వాత సినిమా కూడా హిట్ కొడితే స్టార్ డైరక్టర్ గా పరశురాం కూడా పోటీలో ఉన్నట్టే.

శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది.తన దగ్గరున్న అన్ని కథలు అల్లు అరవింద్ గారికి తెలుసని చెబుతున్న పరశురాం చూస్తుంటే మెగా కాంపౌండ్ లోనే కొంతకాలం ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube