మెగా హీరో సినిమాకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్  

Sai tej movie gets crazy offer from OTT, Mega Heroes, Solo Brathuke So Better, Megastar, Director Subbu - Telugu Director Subbu, Mega Heroes, Megastar, Sai Tej Movie Gets Crazy Offer From Ott, Solo Brathuke So Better

కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ఎక్కువైంది.ఒటీటీ చానల్స్ రేస్ లోకి దూసుకొచ్చి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

 Mega Heroes Solo Brathuke So Better Megastar Director Subbu

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్న సినిమాలకి భారీగా డబ్బులు చెల్లించి కోనేస్తున్నాయి. ఓటీటీ చానల్స్ లో టెలికాస్ట్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాయి.

ఇప్పటికే చాలా సినిమాలు ఒటీటీలో రిలీజ్ అయ్యాయి.ఇక పెద్ద సినిమాలు కూడా ఒటీటీ బాట పడుతున్నాయి.

మెగా హీరో సినిమాకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్-Movie-Telugu Tollywood Photo Image

అనుష్క నిశ్శబ్దం సినిమా కూడా చివరకి ఒటీటీ ద్వారానే రిలీజ్ కి రెడీ అవుతుంది.మరో వైపు వెబ్ సిరీస్ లకి కూడా డిమాండ్ పెరిగింది.

స్టార్ దర్శకులు, హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఒకే చెబుతున్నారు.

ఈ క్రమంలో ఓటీటీ సంస్థల మధ్య పోటీ పెరగడంతో కొత్త సినిమాలకి హీరో మార్కెట్ బట్టి భారీ స్థాయిలో ఆఫర్లు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ నటించిన ఓ చిత్రానికి కూడా భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభానటేష్ జంటగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిపోయింది.వాస్తవానికి ఈ చిత్రాన్ని మే ఒకటిన రిలీజ్ చేయాలని మొదట్లో నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు.థియేటర్లు మూతబడడం వల్ల విడుదల నిలిచిపోవడంతో రిలీజ్ ఆగిపోయింది.అయితే ప్రస్తుతం చిత్ర నిర్మాతలను ఓటీటీ సంస్థలు సంప్రదిస్తున్నాయి.

ఈ క్రమంలో ఒక సంస్థ ఏకంగా 25 కోట్లు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.సినిమా మీద పెట్టిన పెట్టుబడికి ఇది రెట్టింపు సొమ్ము అయిన నిర్మాత ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.

#Mega Heroes #Megastar #Director Subbu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Heroes Solo Brathuke So Better Megastar Director Subbu Related Telugu News,Photos/Pics,Images..