టాలీవుడ్ మెగా హీరో( Mega hero ) ఇటీవలే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.కానీ పర్సనల్ లైఫ్ లో ఎదురైన కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి కమ్ బ్యాక్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇటీవల విడుదల అయినా ఆ మూవీ బాక్సాఫీస్( box office ) వద్ద భారీగా కలెక్ట్ చేసి, తన కెరీర్‌కు బూస్టప్ ఇచ్చింది.ఇదే జోష్‌లో మరొక మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న సదరు హీరో తాజాగా తన మేనేజర్ తోనే గొడవపడినట్లుగ వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తుండగా తాజాగా జరిగిన గొడవలో ఒకరినొకరు తిట్టుకున్నట్లు సమాచారం.

కాగా ఈ మెగా హీరో రీసెంట్ హిట్ మూవీ ప్రమోషన్స్, పబ్లిసిటీ వ్యవహారాలను( Movie promotions , publicity affairs ) సదరు మేనేజరే దగ్గరుండి చూసుకున్నాడట.అలాగే ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ వెన్నంటే ఉన్నాడట సదరు మేనేజర్.నిజానికి మెగా ఫ్యాన్ అయిన అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో జాబ్ మాన్పించి తన దగ్గరే ఉంచుకున్నాడట సదరు హీరో.
అలాగే వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.కానీ తాజాగా మూవీ సెట్స్‌లోనే పెద్ద ఎత్తున గొడవపడటం వారిద్దరినీ ఇన్ని రోజులు దగ్గర నుంచి చూసినవారికి మింగుడుపడటం లేదు.

అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలేషన్స్, బాండింగ్స్ ( Relations, Bondings )అనేవి తాత్కాలికమని మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు నెటిజన్లు.ఇక్కడ ఎంత స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అయినా ఒక్క సూపర్‌హిట్‌తో మారిపోతుందని, అప్పటిదాకా తోడున్నవారు ఒక్కసారిగా కానివారు అయిపోతారని చెప్తున్నారు.నిజానికి ఈ మెగా హీరో కెరీర్‌లో రీసెంట్‌గా విడుదలైన చిత్రమే భారీ విజయాన్ని సాధించింది.దీంతో ఆటోమేటిక్‌గా ప్రయారిటీస్ మారిపోయు ఉండొచ్చనేది నెటిజన్ల వాదన.మరి ఇప్పటికే ఆ మెగా హీరో ఎవరో అనేది మీకు అర్థం అయ్యే ఉంటుంది.
