బాలీవుడ్ పిలుపు అందుకున్న మెగా హీరో!

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో మార్కెట్ పెరిగింది.ఇక ఈ మధ్య చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరు పాన్ ఇండియా సినిమాలపైనే తమ ద్రుష్టి పెట్టారు.

 Mega Hero Varun Tej Received Bollywood Offer Details, Varun Tej, Gani, F3, Anil-TeluguStop.com

ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందరి కంటే ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే.ఇక మన హీరోలు డైరెక్ట్ హిందీ సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను హిందీలో చేస్తుండగా.విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కూడా హిందీలో తెరకెక్కుతుంది.ఇక వేళ్ళతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డైరెక్ట్ హిందీ సినిమా ఛత్రపతి తో రంగ ప్రవేశం చేయబోతున్నాడు.ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ కు కూడా ఆ అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ హిందీ, తెలుగులో ఒక సినిమాను నిర్మించేందుకు ఆసక్తిగా ఉందట.

ఇక ఆ సినిమా లోనే మెగా హీరో వరుణ్ తేజ్ కు అవకాశం వచ్చిందట.

ఇప్పటికే దర్శకుడిని కూడా ఓకే చేయడంతో పాటు స్టోరీ లైన్ కూడా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.

Telugu Allu Aravind, Anil Ravipudi, Bollywood, Gani, Prabhas, Tollywood, Varun T

ఇందుకు సంబంధించిన మిగతా పనులు కూడా ప్రెసెంట్ జరుగుతున్నాయని ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.ఇక ఈ సినిమా ద్వారా వరుణ్ తేజ్ పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఆశ పడుతున్నట్టు టాక్.

Telugu Allu Aravind, Anil Ravipudi, Bollywood, Gani, Prabhas, Tollywood, Varun T

ఇక వరుణ్ తేజ్ ప్రెసెంట్ ‘గని’ సినిమాలో నటిస్తున్నాడు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ సినిమాను డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఇక వరుణ్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్ ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమా కూడా ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube