నిహారికకు ఎప్పుడు సలహాలు ఇవ్వను.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్?

మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సిరీస్లలో నటిస్తూ వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది.ఈ క్రమంలోని తాజాగా నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ఫ్రీ రిలీజ్ వేడుక జరిగింది.

 Mega Hero Varun Tej Comment About Niharika It Goes Viral Varun Tej, Mega Hero, T-TeluguStop.com

ఈ కార్యక్రమానికి నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మహేష్‌ ఉప్పాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో సంగీత్‌శోభన్‌, సిమ్రాన్‌శర్మ, సీనియర్‌ నరేష్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ క్రమంలోనే ఈ సిరీస్ ఈ నెల 19వ తేదీ జీ 5 లో ప్రసారం కానుంది.

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో జరపగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ తేజ్ మాట్లాడుతూ.

నిహారిక చేస్తున్న సిరీస్ లు, సినిమాల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని,ప్రయోగాత్మక ఇతివృత్తాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం కోసం నిహారిక కష్టపడుతుందని అందుకోసమే తనకి ఎప్పుడు ఎలాంటి సలహాలు ఇవ్వనని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలియజేశారు.

Telugu Niharika, Tollywood, Varun Tej-Movie

ఇక ఈ కార్యక్రమంలో నిహారిక మాట్లాడుతూ.వినోదాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ఇదని అవసరానికి మించి లోన్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించామని ఈ సందర్భంగా నిహారిక మాట్లాడారు.ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నిహారిక వెల్లడించారు.

ఇక ఈ కార్యక్రమానికి సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, దర్శకుడు మహేష్ ఉప్పల పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube