దీపావళి అడ్వాన్స్ బుకింగ్ కూడా అవుతున్నాయి

టాలీవుడ్‌ సినిమాలు వరుసగా బాక్సీఫీస్‌ వద్ద క్యూ కట్టేందుకు సిద్దం అవుతున్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ మొదలుకుని పుష్ప వరకు చాలా వరకు సినిమాలు ఎప్పుడు వచ్చే విషయమై క్లారిటీ ఇచ్చారు.

 Mega Hero Varun Tej Coming For Diwali With Gani Movie-TeluguStop.com

ఇందులో చాలా సినిమాలు ఈ ఏడాది ఆరంభంలోనే తమ సినిమాల విడుదల తేదీని ప్రకటించాయి.కాని సెకండ్ వేవ్‌ కారణంగా సినిమాలను విడుదల చేయలేక పోయారు.

దాంతో మళ్లీ కొత్త విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు.ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను దసరా కానుకగా అక్టోబర్‌ లో విడుదల చేయబోతున్నారు.

 Mega Hero Varun Tej Coming For Diwali With Gani Movie-దీపావళి అడ్వాన్స్ బుకింగ్ కూడా అవుతున్నాయి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దసరాకు మరో రెండు సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక క్రిస్మస్ కానుకగా వచ్చేందుకు పుష్ప సిద్దం అవుతోంది.

పుష్పతో పాటు మరో పెద్ద సినిమా కూడా క్రిస్మస్ కు రాబోతుంది.ఇక సంక్రాంతికి పెద్ద సినిమాల జాతరే ఉంది.

ఇక మిగిలింది ఒక్క దీపావళి.మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న గని సినిమా ను దీపావళికి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.ఇప్పటి వరకు దీపావళికి తమిళ సినిమా అన్నాత్తే విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

Telugu Annatthe, Dasara Movies, Director Kiran Korrapati, Diwali Movie, Gani, Mega Movie, Ntr, Pushpa, Rajnikanth, Ram Charan, Rrr, Tollywood, Varun Tej-Movie

అన్నాత్తే కు పోటీ అన్నట్లుగా గని సినిమా విడుదల కాబోతుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న గని సినిమా షూటింగ్‌ ను తుది దశకు తీసుకు వచ్చారు.అతి త్వరలోనే సినిమాను పూర్తి చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో బాక్సింగ్‌ నేపథ్యం లో కథ సాగుతోంది.ఈ సినిమా కోసం వరుణ్ తేజ్‌ ఏ స్థాయిలో కండలను పెంచుతున్నాడో ఇప్పటికే మనం చూశాం.

#Pushpa #Kiran Korrapati #Diwali #Gani #Rajnikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు