మెగా 'ఉప్పెన' సీక్వెల్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటించిన ఉప్పెన సినిమా సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది.దాదాపుగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది.50 కోట్లకు పైగా షేర్‌ ను రాబట్టిన ఈ సినిమా మరింతగా వసూళ్లు చేయడం ఖాయం అంటూ యూనిట్‌ వర్గాల వారు నమ్మకంగా ఉన్నరు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్ల లెక్కలు ట్రెండ్‌ అవ్వడంతో పాటు సినిమా సీక్వెల్ మరియు రీమేక్ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.

 Mega Hero Vaishnav Tej Uppena Movie Sequel News-TeluguStop.com

ఉప్పెన సినిమాను తమిళం మరియు హిందీలో రీమేక్‌ చేయడం ఖాయం అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చింది.భారీ ఎత్తున హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.తమిళంలో వచ్చే ఏడాది ఉప్పెన రీమేక్‌ ఉంటుందని చెబుతున్నారు.

 Mega Hero Vaishnav Tej Uppena Movie Sequel News-మెగా ఉప్పెన’ సీక్వెల్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే సమయంలో ఉప్పెన సీక్వెల్ కు బుచ్చి బాబు ఏర్పాటు చేస్తున్నాడు అంటున్నారు.

ఉప్పెన సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఖచ్చింగా సీక్వెల్‌ తీయాలని యూనిట్‌ సభ్యులు అనుకుంటూ ఉంటారని కొందరు బలంగా ప్రచారం చేస్తున్నారు.

కాని అది ఏమాత్రం నిజం కాదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ విషయాన్ని కొందరు మీడియా మిత్రలు యూనిట్‌ సభ్యుల వద్ద ప్రస్థావించగా కేవలం పుకార్లే అంటూ తేల్చి చెప్పేశారు.

ఉప్పెన సినిమా కథ కు సీక్వెల్‌ ఛాన్స్ లేదని ఏదో సక్సెస్ అయ్యింది కదా అని ఊరికే సీక్వెల్‌ చేస్తే ఫలితం బెడిసి కొట్టే అవకాశం ఎక్కువ ఉందని అందుకే ఉప్పెన సీక్వెల్‌ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ వారు చెబుతున్నారు.ఉప్పెన కథ కు సీక్వెల్‌ చేయాలంటే కొత్త కథను తయారు చేయాల్సి ఉంటుంది.

అప్పుడు ఫీల్‌ మిస్ అవుతుంది.కనుక సీక్వెల్ అనేది సాధ్యం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

#Uppena #Vaishnav Tej #UppenaMovie #Krithy Shetty #Bucchi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు