వైష్ణవ్‌ తేజ్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేసి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు వచ్చిన ఏ హీరోకు దక్కని మెగా ఎంట్రీ ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్‌ కు దక్కింది అనడంలో సందేహం లేదు.అద్బుతమైన ఆధరణ ఉప్పెనకు దక్కింది.

 Mega Hero Vaishnav Tej Clarity On Twitter Account, Mega Hero Twitter, Uppena, Vi-TeluguStop.com

వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో వైష్ణవ్‌ తేజ్‌ రేంజ్ ఒక్క సినిమా తోనే ఆకాశమే హద్దుగా పెరిగి పోయింది.ప్రస్తుతం ఆయన సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడు వైష్ణవ్‌ కొత్త సినిమాలు చేయబోతున్నాడు అంటూ ఎదురు చూస్తున్న సమయంలో కొందరు ఆయన పేరును తప్పుగా ఉపయోగిస్తున్నారు.సోషల్‌ మీడియాలో వైష్ణవ్‌ తేజ్ పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్‌ హల్‌ చల్‌ చేస్తుంది.

వేల కొద్ది పాలోవర్స్ ఆ అకౌంట్‌ ను ఫాలో అవుతున్న నేపథ్యంలో వైష్ణవ్‌ స్వయంగా ప్రెస్ నోట్‌ ను విడుదల చేసి మరీ క్లారిటీ ఇచ్చాడు.

తన పేరుతో ట్విట్టర్‌ లో కొందరు అకౌంట్ లను ఓపెన్‌ చేసి హడావుడి చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చింది.

ఇప్పటి వరకు తనకు ట్విట్టర్ లో అకౌంట్‌ లేదు.తాను ట్విట్టర్ లో పోస్ట్‌ లు పెట్టను.కనుక దయచేసి గుర్తించండి అంటూ పేర్కొన్నాడు.ఆయన పేరుతో ఇన్నాళ్లుగా ఆయన అఫిషియల్ అకౌంట్ లుగా చెలామని అవుతున్న అకౌంట్‌ లు అన్ని కూడా ఇక మూసేయాల్సిందే.

జనాలు వాటిని గుడ్డిగా నమ్మవద్దని పీఆర్ టీమ్ కూడా విజ్ఞప్తి చేస్తుంది.ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఏ వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

తనకు ట్విట్టర్ లో అకౌంట్ లేదంటూ ప్రకటించిన వైష్ణవ్‌ తేజ్‌ కు చాలా మంది ఆహ్వానం పలుకుతున్నారు.ఇప్పటికి అయినా వెంటనే ట్విట్టర్ లో అకౌంట్‌ తీసుకోవాలని కోరుతున్నారు.

మరి వైష్ణవ్‌ ఎప్పటికి ట్విట్టర్ లోకి వస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube