రిపబ్లిక్‌ లో సాయి ధరమ్‌ తేజ్ పాత్ర ఏంటో తెలుసా?

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత గత ఏడాది చివర్లో సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కరోనా కారణంగా థియేటర్లు మూత పడి పునః ప్రారంభం అయిన తర్వాత విడుదల అయిన మొదటి పెద్ద సినిమా సోలో బ్రతుకే సో బెటర్‌.

 Mega Hero Sai Dharam Tej As Ias In Republic Movie, Solo Bathuke So Better, Coron-TeluguStop.com

ఆ సినిమా మంచి వసూళ్లను దక్కించుకోవడంతో పాటు మంచి టాక్ ను కూడా దక్కించుకుంది.ఆ సినిమా తర్వాత ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్ నటిస్తున్న సినిమాకు దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది.ఇటీవలే ఈ సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్‌ ను ఖరారు చేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో సాయి ధరమ్‌ తేజ్‌ ఏ పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయమై స్పష్టత వచ్చింది.

సినీ వర్గాల నుండి మరియు మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ కలెక్టర్ గా కనిపించబోతున్నాడు.

రాజకీయ నాయకులతో పోరాటం సాగించే ఒక యువ కలెక్టర్ గా సాయి ధరమ్‌ తేజ్ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సోషల్ మెసేజ్‌ లు బాగా చూపించే సత్తా ఉన్న దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాను మరింత స్పెషల్ గా చూపించడం ఖాయం అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

పెద్ద మొత్తంలో ఈ సినిమాకు బడ్జెట్‌ ఖర్చు చేయకుండా సింపుల్ గానే రిచ్ లుక్ తో తెరకెక్కిస్తున్నారట.ఇక ఈ ఈసినిమా ఎక్కువగా ఏలూరు రీజియన్‌ లో షూటింగ్ జరుపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ సినిమా ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి కాబోతున్నాయి.

Telugu @republic, Corona, Deva Katta, Republic, Role, Sai Dharam Tje, Message, S.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube