పెళ్లిసందD హీరోయిన్‌ తలుపు తట్టిన మెగా ఆఫర్‌

పెళ్లిసండD సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల.సినిమా ప్లాప్‌ అయినా కూడా ప్రస్తుతం హీరోయిన్ గురించి తెగ చర్చ జరుగుతోంది.తెలుగు మూలాలు ఉన్న అమ్మాయిగా ఈమె మీడియాలో నిలిచింది.ఈమె తల్లి మాజీ భర్త తెలుగు వ్యక్తి అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.కాని శ్రీలీలను మాత్రం తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకున్నారు.

 Mega Hero Movie Chance For Pellisandad Movie Heroine-TeluguStop.com

సినిమా సక్సెస్ అయ్యి ఉంటే అమ్మడి రేంజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండేది.ప్లాప్ అయినా కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా ఆఫర్లు దక్కించుకుంటుంది.

తెలుగు లో ఈ అమ్మడికి తాజాగా రవితేజ సరసన నటించే అవకాశం వచ్చింది.ఆ సినిమాకు త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించబోతున్నాడు.

రెండవ సినిమా కు ఓకే చెప్పిన శ్రీలీలా మరో రెండు సినిమా లు ఓకే అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి.మూడవ సినిమా ఈమె మెగా ఛాన్స్ దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి.

Telugu Pellisandad, Ravi Teja, Srileela-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి సందడి హీరోయిన్‌ శ్రీలీలకు ఒక మెగా హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఆ మెగా హీరో మూవీ ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో వచ్చే ఏడాదిలో పట్టాలెక్కబోతుంది.ఆ మెగా హీరో సూపర్‌ హిట్‌ సినిమా తో మంచి జోరు మీదున్నాడు.కనుక ఆయన సినిమా లో నటిస్తే ఖచ్చితంగా శ్రీలీలా రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు.

మెగా మూవీలో నటించిన తర్వాత అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరగడం ఖాయం.తద్వారా టాలీవుడ్‌ లో ఈమెకు టాప్‌ హీరోయిన్ ల జాబితాలో ఛాన్స్ దక్కడం కూడా ఖాయం.

వరుసగా సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నా కూడా ఆచితూచి సినిమాలను ఈ అమ్మడు ఎంపిక చేసుకుంటూ ఉంది.రవితేజ తర్వాత చేయబోతున్న సినిమా ఎప్పుడు ఏంటీ అనేది త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube