నాలాంటి వాళ్లు వెబ్‌ సిరీస్‌లు చేస్తే కెరీర్‌ నాశనమే అంటున్న మెగా అల్లుడు  

OTT Release, Super Machi, Kalyan Dev, Mega Hero, Web Series, kalyan Dev on Web Series - Telugu Kalyan Dev, Kalyan Dev On Web Series, Mega Hero, Ott Release, Super Machchi, Web Series

స్టార్‌ హీరోలు హీరోయిన్స్‌ ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.చాలా మంది దర్శకులు కూడా వెబ్‌ సిరీస్‌ల వెంట పడుతున్నారు.

 Mega Hero Kalyan Dev Web Series

ఇలాంటి సమయంలో మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ తన ఓటీటీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తాను మాత్రమే కాదు, తనలా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు ఎవరు కూడా ఓటీటీలో సినిమాలు చేయవద్దని చెబుతున్నాను.

ఎందుకంటే ఓటీటీ కంటెంట్‌ లో నటిస్తే జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు.

నాలాంటి వాళ్లు వెబ్‌ సిరీస్‌లు చేస్తే కెరీర్‌ నాశనమే అంటున్న మెగా అల్లుడు-Movie-Telugu Tollywood Photo Image

స్టార్‌ హీరోలు ఓటీటీల్లో నటించడం వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం వంటివి చేస్తే వారి క్రేజ్‌ మరింతగా పెరుగుతుంది.

కాని కొత్త వారు నాలాంటి హీరోలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తే ఆఫర్లు లేకపోవడం వల్లే ఓటీటీ బాట పట్టాడు అంటూ అభిప్రాయంకు వచ్చేస్తారు.మీడియాలో కూడా అదే ప్రచారం జరుగుతుంది.

మళ్లీ సినిమాలు చేసినా కూడా జనాలు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని కళ్యాణ్‌ దేవ్‌ చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈయన సూపర్‌ మచ్చి చిత్రంను పూర్తి చేశాడు.ఆ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.త్వరలోనే సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

కాని అది నిజం కాదంటూ ఆయన పేర్కొన్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పనులు హడావుడిగా జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఓటీటీలో విడుదల ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

#Web Series #OTT Release #Mega Hero #Kalyan Dev #Super Machchi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Hero Kalyan Dev Web Series Related Telugu News,Photos/Pics,Images..