మెగా ఫ్యామిలీకి దూరం కావడం వల్లే కళ్యాణ్ దేవ్ కెరీర్ నాశనమైందా.. రిలీజ్ చేయలేక?

మెగా ఫ్యామిలీ హీరోగా కళ్యాణ్ దేవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.శ్రీజ భర్త కావడం వల్ల కళ్యాణ్ దేవ్ కు సినిమాలలో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

 Mega Hero Kalyan Dev Career In Deep Troubles Details Here , Career In Trouble-TeluguStop.com

అయితే కళ్యాణ్ దేవ్ నటించిన విజేత, సూపర్ మచ్చి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.శ్రీజకు దూరంగా ఉండటం వల్లే కళ్యాణ్ దేవ్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.

కళ్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ డైరెక్షన్ లో రామ్ తాళ్లూరి నిర్మాతగా కిన్నెరసాని అనే సినిమా తెరకెక్కగా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావడం లేదు.ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం అందుతోంది.

కళ్యాణ్ దేవ్ వైరల్ అవుతున్న వార్తల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సూపర్ మచ్చి సినిమా సంక్రాంతికి విడుదల కాగా ఈ సినిమాకు దారుణంగా కలెక్షన్లు వచ్చాయి.

కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని సినిమాతో కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది.అయితే ఈ సినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరకడం కూడా కష్టంగా మారింది.

మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో నిర్మాతలు సైతం కళ్యాణ్ దేవ్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.కళ్యాణ్ దేవ్ సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

Telugu Career, Kalyan Dev, Kinnerasani, Ramana Teja, Shreeja, Machi-Movie

మరోవైపు శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య దూరం పెరిగిందని వార్తలు వస్తున్నా ఆ వార్తల గురించి స్పందించడానికి శ్రీజ కానీ కళ్యాణ్ దేవ్ కానీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.మెగా ఫ్యామిలీ నుంచి ఇందుకు సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube