మెగా హీరో బర్త్ డే.. బడా ఈవెంట్ ప్లాన్ చేస్తున్న అభిమానులు..!

టాలీవుడ్ మెగా హీరో త్వరలోనే బర్త్ డే ఉన్నందున ఆయన అభిమానులు బడా ఈవెంట్ ప్లాన్ లు చేస్తున్నారు.ఇంతకీ ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా హీరో రామ్ చరణ్.

 Mega Hero Birthday Fans Planning A Big Event Ram Charan, Birthday, Fans Planning-TeluguStop.com

రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నాడు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

త్రిబుల్ ఆర్ సినిమాలో మరో యంగ్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఆచార్య.ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్ర లో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కానుంది.ఇదిలా ఉంటే మార్చి 26న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆ రోజున ఆయన అభిమానులు పలు కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Telugu @alwaysramcharan, Fans, Ram Charan, Tollywood-Movie

హైదరాబాద్ శిల్పకళావేదికలో మేజర్ ఈవెంట్ జరగనుందని అంతేకాకుండా దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆర్ సీ యువశక్తి చూసుకుంటుందట‌.అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుండి పలువురు హీరోలు కూడా హాజరు కానున్నారట.ఇక కొందరు అభిమానులు కొన్ని నెలలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారట.ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారట.

ఇక రామ్ చరణ్ మరో క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.సరికొత్త కాన్సెప్ట్ తో పొలిటికల్ ఎంటర్ టైన్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా చేయనున్నాడు.మొత్తానికి రామ్ చరణ్ రాజమౌళి, శంకర్ దర్శకత్వంలో వరుస సినిమాలను సొంతం చేసుకునేందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గొప్ప రికార్డు సాధించాడని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube