మెగా వార్ ముదురుతోందే ! పవన్ స్పందించడేమి ?  

Mega Fight Between Pawan Kalyan Fans And Chiranjvi Fans-pawan Kalyan

వైసీపీ అధినేత జగన్ ను కలిసేందుకు మెగా స్టార్ చిరంజీవి సతి సమేతంగా విజయవాడ చేరుకున్నారు.ఆయనతో లంచ్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు.అసలు వారి భేటీ పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నా అసలు విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడంలేదు.

Mega Fight Between Pawan Kalyan Fans And Chiranjvi Fans-pawan Kalyan-Mega Fight Between Pawan Kalyan Fans And Chiranjvi Fans-Pawan

అయితే ఈ విషయంలో మెగా ఫ్యామిలిలో ఏ విధమైన చర్చ జరిగిందన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు మెగా హీరోల ఫ్యాన్స్ మాత్రం వాదులాట మొదలుపెట్టారు.ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని వైసీపీ వర్గాలు, మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నా, ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు పెరిగిపోయాయి.

Mega Fight Between Pawan Kalyan Fans And Chiranjvi Fans-pawan Kalyan-Mega Fight Between Pawan Kalyan Fans And Chiranjvi Fans-Pawan

ఈ సమావేశంలో చిరంజీవి, జగన్ ఏం చర్చించుకుంటారనే అంశం పక్కనపెడితే పవన్ చిరు ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారు.

వాస్తవంగా చూసుకుంటే సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం కావడం మెగా అభిమానులు ఎవరికీ రుచించడంలేదు.అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏ మాత్రం ఇష్టంలేదనే విషయం అందరికి అర్ధం అయిపొయింది.

ఓ వైపు తమ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విధానాలపై పోరాడుతుంటే చిరంజీవి సీఎం జగన్‌తో ఏ విధంగా భేటీ అవుతారని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నిస్తూ అసంతృప్తితో రగిలిపోతున్నారు.మొత్తానికి సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం అనంతరం మెగా అభిమానులు, అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇక పవన్ విషయానికి వస్తే ఆయన జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ రాజకీయం ఉంటూ వచ్చింది.తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతిన్నా భవిష్యత్ లో తనకు ఆ పార్టీతో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జగన్ భావిస్తున్నారు.అందుకోసమే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా మద్దతివ్వని చిరంజీవితో సన్నిహితంగా మెలుగుతూ పవన్ కు అండగా నిలుస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గంకు దగ్గరవ్వాలని ఆలోచనలో జగన్ ఉన్నారు.

ఇక చిరు కూడా జగన్ విషయంలో సానుకూలంగా ఉండడంతో వీరి భేటీపై ఆసక్తి నెలకొంది.కాకపోతే ఇప్పటి వరకు చిరు జగన్ భేటీ అంశం గురించి పవన్ ఎక్కడా స్పందించకవాదం చూస్తుంటే వారిరువురి భేటీపై పవన్ అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.