చిరు లుక్ పై మెగా ఫ్యాన్స్ లో డివైడ్ టాక్..!

మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.ఈ రీమేక్ సినిమాని తమిళ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.

 Mega Fans Upset With Megastar Chiranjeevi Godfather First Look Details, Chiranje-TeluguStop.com

సోమవారం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైంది.సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్ అదరగొట్టారు.

మెగా ఫ్యాన్స్ అందరికి ఈ లుక్ నచ్చేసింది.టీజర్ లో చిరు స్టైల్ కూడా అదిరిపోయిందని అన్నారు.

కానీ కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ లుక్ మీద అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది.

మాస్ లీడర్.

బాక్సాఫీస్ బాద్షా మా మెగాస్టార్ చిరంజీవిని అలా తెల్ల జుట్టుతోని చూపించారేంటి అని కొందరు మెగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.అయితే పాత్రని బట్టి లుక్ ఉంటుంది.

ఈ సినిమాలో ఆయన పొలిటీషియన్ గా నటిస్తున్నాడు కాబట్టి అలాంటి లుక్ కంపల్సరీ అంతేకాదు చిరు డ్రెసింగ్ స్టైల్ గురించి కూడా కొందరు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ వైడ్ అండ్ వైట్ వేశాడు.

కానీ చిరుకి బ్లాక్ అండ్ బ్లాక్ ఎందుకు వేశారని అంటున్నారు.

Telugu Chiranjeevi, Chiru Godfather, Godfather, Mohan Raja, Salman Khan, Tollywo

రీమేక్ అన్న తర్వాత కొద్ది మార్పులు సహజం.అందులోనూ లుక్ విషయంలో మోహన్ లాల్ లా ఉండాలని ఏమి రూల్ లేదు.పాత్ర ఎలా అయినా డిజైన్ చేయొచ్చు.

అందుకే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లుక్ అలా ఫిక్స్ చేశారట.ఈ సినిమాలో బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు.

సినిమాలో ఆయన పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.మెగా గాడ్ ఫాదర్ లో సత్యదేవ్, సునీల్ వంటి నటులు కూడా నటిస్తున్నారు.

దసరాకి గాడ్ ఫాదర్ రిలీజ్ ఎనౌన్స్ చేశారు.మెగా ఫ్యాన్స్ కి దసరా పండుగకి బాక్సాఫీస్ సందడి షురూ అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube