పవన్ కు ' మెగా ' బ్రేకులు ?  

మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.గతంలో ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

TeluguStop.com - Mega Fans Troubuled On Pavan Chiranjivi Desistions

ఇక ఆ తరువాత నడిపించే సత్తా లేకుండా, కాంగ్రెస్ లో విలీనం చేశారు.ఇక ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చిరంజీవి రాజకీయాల్లో ఉన్నా, ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టి  తెలుగు సినిమా ఇండస్ట్రీ బరువు బాధ్యతలను భుజాన వేసుకుని మోస్తున్నారు.

దాసరి  నారాయణరావు లేని లోటు చిరంజీవి భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్,  కెసిఆర్ లతో సన్నిహితంగా ఉంటూ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపిస్తున్నారు.

TeluguStop.com - పవన్ కు మెగా బ్రేకులు -Political-Telugu Tollywood Photo Image

ఇంతవరకు చిరంజీవి వ్యవహారంలో తప్పు పట్టేందుకు ఏమీ లేకపోయినా, చిరు వ్యవహారం ఆయన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాత్రం ఇబ్బందికరంగా మారింది.

Telugu Ap, Chiranjivi, Jagan, Janasainikulu, Kcr, Mega Fans, Mega Star, Pavan Kalyan, Telangana, Ysrcp-Telugu Political News

చిరు ఏపీలో జగన్ తో నిత్యం పవన్ యుద్ధమే చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం విధానాలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అంటూ అదేపనిగా పవన్ విమర్శలు చేస్తూ రాజకీయంగా పై సాధించేందుకు చూస్తున్నాడు.సరిగ్గా అదే సమయంలో చిరంజీవి జగన్ ను రెండుసార్లు కలవడం, సినిమా ఇండస్ట్రీ సమస్యలను చెప్పడం, జగన్ సానుకూలంగా స్పందించడం,  తర్వాత జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూ, జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ వస్తుండడం ఇవన్నీ జనసేనకు పెద్ద తలనొప్పి మారాయి  తెలంగాణలోనూ పవన్ రాజకీయంగా ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చిరంజీవి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను ప్రస్తావించి, ఆ తర్వాత కేసీఆర్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి వ్యవహారాలు జనసేనకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.

పవన్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విమర్శిస్తున్న సమయంలో చిరంజీవి పొగుడుతూ వస్తుండడం మెగా ఫ్యాన్స్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయి.ఎందుకంటే ప్రస్తుతం జనసేన లో ఉన్న మూడు వంతుల మంది మెగాస్టార్ చిరంజీవి, పవన్ ఇద్దర్ని అభిమానించేవారే.

ఇద్దరు రెండు వేరు వేరు దారుల్లో వెళ్తుండటంతో వారు అయోమయానికి గురవుతున్నారు.చిరంజీవి కోణంలో చూస్తే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలనుకునే క్రమంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సఖ్యతగా ఉంటున్నారు .పవన్ విషయానికి వస్తే, రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని , రెండు ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు.పవన్ వెర్షన్ లోనూ ఇది కరెక్టే.

అయితే చిరు పవన్ ల వ్యవహారం జన సైనికులకు ఇబ్బందికరంగా మారింది.అలాగే చిరు వ్యవహారం పవన్ కు మరింత ఇబ్బందికరంగా మారింది.

#Chiranjivi #Mega Star #Jagan #Janasainikulu #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mega Fans Troubuled On Pavan Chiranjivi Desistions Related Telugu News,Photos/Pics,Images..