అభిమానం అంటే ఇదే.. క్యూబ్స్ తో 6.5 ఫీట్ల చిరు వైరల్ ఫోటో!

మెగాస్టార్ చిరంజీవికి కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆగస్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 Mega Fans Tribute Pic Made 955 Rubiks Goes Viral  Chiranjeevi, Mega Star Birthda-TeluguStop.com

అదేవిధంగా మెగాస్టార్ అభిమానులు రక్తదానం వంటి వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ఆయన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మెగాస్టార్ అభిమానులు చేసిన అద్భుతమైన ప్రయత్నం ఎంతోమంది మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తమిళనాడుకు చెందిన రూబిక్ క్యూబ్ అసోసియేషన్‌కు చెందిన బిందు ఆనంద్ అనే వ్యక్తులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 955 రూబిక్ క్యూబ్స్ తో 6.5 అడుగుల ఎత్తయిన, అరుదైన మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోను రూపొందించి ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన ఎందరో మెగా అభిమానులు వారి పై ప్రశంసలు కురిపించగా మరికొందరు ఇది కదా అసలైన అభిమానం అంటే అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆయన చేస్తున్న సినిమాల నుంచి వరుస అప్ డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.మరెందుకు ఆలస్యం ఆ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube