ఆ కంటెస్టెంట్ కు సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. విన్నర్ అవుతాడంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 గత సీజన్ల స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ షోను ఆదరిస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఏ మాత్రం ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్లు తమ ప్రవర్తన ద్వారా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

 Mega Fans Support For Bigg Boss Contestant Manas Why Because, Mega Fans , Bigg Boss , Telugu Biggboss , Biggboss 5 , Manas , Sunny , Shanmukh , Ravi, Priyanka Singh-TeluguStop.com

అదే సమయంలో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు మాత్రం బిగ్ బాస్ షో ద్వారా నెగిటివ్ ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు.

బిగ్ బాస్ సీజన్5 విన్నర్ ఎవరనే ప్రశ్నకు వేర్వేరు పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి.

 Mega Fans Support For Bigg Boss Contestant Manas Why Because, Mega Fans , Bigg Boss , Telugu Biggboss , Biggboss 5 , Manas , Sunny , Shanmukh , Ravi, Priyanka Singh-ఆ కంటెస్టెంట్ కు సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. విన్నర్ అవుతాడంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్2 సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతు ఇవ్వడం వల్లే కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచారని కామెంట్లు వినిపించాయి.బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ విన్నర్ కావడానికి సోషల్ మీడియా ఆర్మీలు ఎంతో కష్టపడ్డాయి.

అయితే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో అభిజిత్ ఫెయిల్ అయ్యారు.

Telugu Bigg Boss, Biggboss, Manas, Fans, Priyanka Singh, Ravi, Shanmukh, Sunny, Telugu Biggboss-Movie

బిగ్ బాస్ సీజన్4 కంటెస్టెంట్లలో చాలామంది కంటెస్టెంట్లు వరుస ఆఫర్లతో బిజీ అయినా అభిజిత్ కు మాత్రం సినిమా ఆఫర్లు ఎక్కువగా రాలేదు.ఈ సీజన్ లో సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, రవిలలో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా మానస్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను మానస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ను సంపాదించుకున్నారని సమాచారం.

నాగబాబు ప్రియాంక సింగ్ కు మద్దతు ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో కొందరు ప్రియాంకను కూడా సపోర్ట్ చేస్తున్నారు.ఈ సీజన్లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో సీజన్5 ముగియడానికి కొన్నిరోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సీజన్ లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్ ను గెలిపించుకోవడానికి ఆయా కంటెస్టెంట్ల అభిమానులు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube