బన్నీ తల పొగరు.. మెగా ఫ్యాన్స్‌ తీవ్ర ఆగహ్రం     2018-07-31   10:16:34  IST  Ramesh Palla

అల్లు అర్జున్‌ అప్పుడప్పుడు మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహంకు లోను అవుతూనే ఉన్నాడు. ఆమద్య పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో చిన్నపాటి యుద్దమే చేసిన అల్లు అర్జున్‌ ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు. తాజాగా ‘గీత గోవిందం’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో అల్లు అర్జున్‌ పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారంను రేపుతున్నాయి. మెగా ఫ్యాన్స్‌పై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని కలుగజేస్తున్నాయి. బన్నీ చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని తగ్గించేవిగా ఉన్నాయని, చిరంజీవి అంటే ఆయనకు గౌరవం లేనట్లుగా ఉన్నాయి అంటూ మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Mega Fans Serious On Allu Arjun Comments-

Mega Fans Serious On Allu Arjun Comments

‘గీత గోవిందం’ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించాడు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న కారణంగా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అర్జున్‌కు బన్నీ వాసు ఆప్త మిత్రుడు. వాసు తన స్నేహంకు గుర్తుగా తన పేరుకు ముందు బన్నీ అని తలిగించేసుకున్నాడు. ఇద్దరి మద్య మంచి స్నేహం ఉండటంతో అల్లు అరవింద్‌ కూడా తన సినిమాల నిర్మాణ బాధ్యతను బన్నీ వాసుపై వేశాడు. ఇక బన్నీకి పీఆర్‌గా కూడా వాసు వ్యవహరిస్తూ ఉంటాడు. కథలు వినడం దగ్గర నుండి డేట్లు చూసే వరకు అన్ని కూడా బన్నీ వాసు చూస్తూ అల్లు అర్జున్‌ సినీ కెరీర్‌లో కీలక పాత్రలు పోషించాడు.

Mega Fans Serious On Allu Arjun Comments-

బన్నీ వాసు గురించి గీత గోవిందం ఆడియో వేడుకలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌ ఈ స్థాయిలో ఉంది అంటే అందుకు ప్రధాన కారణం తన తండ్రి అల్లు అరవింద్‌ అయితే, ఆ తర్వాత స్థానం ఖచ్చితంగా బన్నీ వాసుది అవుతుందని చెప్పుకొచ్చాడు. బన్నీ వాసు పక్కా ప్లానింగ్‌ వల్లే తాను ఈ స్థాయిలో, స్టార్‌డంతో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. బన్నీ వాసు తన సినీ కెరీర్‌లో చాలా హెల్ప్‌ చేశాడు అంటూ అల్లు అర్జున్‌ చెప్పడం జరిగింది. ఈ సమయంలో అల్లు అర్జున్‌ చిరంజీవి పేరు ఎత్తక పోవడంను మెగా ఫ్యాన్స్‌ తప్పుబడుతున్నారు.

తన సినీ కెరీర్‌ ఇంత సక్సెస్‌ఫుల్‌గా దూసుకు పోవడానికి కారణం అల్లు అరవింద్‌, బన్నీ వాసు అంటూ చెప్పిన అల్లు అర్జున్‌ తన మామ చిరంజీవి పేరును ఎలా మర్చిపోతాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు. చిరంజీవి అనే వ్యక్తి లేకుంటే తెలుగు ప్రేక్షకులకు అల్లు అర్జున్‌ అనే వ్యక్తి తెలిసే వాడేనా అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. సినీ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తిని మర్చి పోవడం అనేది కన్న తల్లిని మర్చిపోవడంతో సమానం, అందుకే చిరంజీవికి వెంటనే అల్లు అర్జున్‌ క్షమాపణలు చెప్పాలిందే అంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదంపై బన్నీ ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది చూడాలి.