మెగా ట్విట్టర్‌ స్పేస్‌.. లక్ష మంది టార్గెట్‌, సుమ హోస్ట్‌

ఇటీవల సూపర్ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు ట్విట్టర్‌ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది.ట్విట్టర్ లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ ను స్టార్‌ హీరోల అభిమానులు తెగ వాడేస్తున్నారు.

 Mega Fans Meet At Twitter Space , Chirenjeevi, Flim News, Mega Fans, News About-TeluguStop.com

వందల నుండి లక్షల మంది ఒకే సారి ఈ స్పేస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.జూమ్ మీటింగ్ మాదిరిగానే కాని వీడియో విజుబులిటీ ఉండదు.

కేవలం ఆడియో మాత్రమే ఇందులో ఉంటుంది.ఆడియో తో తమ హీరోల గురించి ఇందులో మాట్లాడుకుంటూ ఉంటారు.

తాజాగా మహేష్ బాబు అభిమానులు దాదాపుగా పాతిక వేల మంది ఈ వేదిక ద్వారా మాట్లాడుకున్నారు.మహేష్‌ బాబుతో సన్నిహితంగా ఉండే వారు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఈ ట్విట్టర్ స్పేస్ లో పాల్గొన్నారు.

ఇప్పుడు చిరంజీవి అభిమానులు ఈ కార్యక్రమంను ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నారు.

చిరంజీవి ఫ్యాన్స్ అఫిషియల్‌ ఫ్యాన్‌ పేజ్ లో సుమ హోస్ట్‌ గా ఈ స్పేస్ ను ఏర్పాటు చేయబోతున్నారు.ఈ ట్విట్టర్ స్పేస్ కు ఏకంగా లక్ష మంది హాజరు అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.ప్రస్తుతం చిరంజీవి అభిమానులతో పాటు అంతా కూడా ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సుమ హోస్ట్‌ గా ఇప్పటి వరకు ఎన్నో షో లు చేసింది.మొదటి సారి ట్విట్టర్‌ స్పేస్ లో ఆమె హోస్టింగ్‌ చేయబోతుంది.ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్‌ అవుతున్న ఈ వ్యవహారం తీరు చూస్తుంటే ఆ రోజున లక్ష మంది వరకు స్పేస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.పెద్ద ఎత్తున మెగా అభిమానులు పాల్గొనబోతున్న ఈ షో లో మెగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి మెగా ఫ్యామిలీ హీరోలు మరియు ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాల దర్శకులు మాట్లాడబోతున్నారు.

ఈ ట్విట్టర్ స్పేస్ ను పెద్ద ఎత్తున నిర్వహించి సక్సెస్ చేస్తే ముందు ముందు మరిన్ని ట్విట్టర్ స్పేస్ లు రాబోతున్నాయని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube