ఒకప్పుడు స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ హీరో సినిమా ఎక్కువ థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడాలంటూ కోరుకునే వారు.అందుకోసం నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇచ్చి మరీ రికార్డులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించేవారు.
మా హీరో సినిమా 50 రోజులు అత్యధిక థియేటర్లలో ఆడినది అని 200 రోజులు కూడా ఆడినది, 365 డేస్ ఆడినది అంటూ అభిమానులు చెప్పుకునే వారు.ఈ మద్య థియేటర్ల సంఖ్య విషయంలో రికార్డులు సాధ్యం కావడం లేదు.
దాంతో కలెక్షన్స్ విషయంలో పోటీ పడటం మొదలు పెట్టారు.అది కూడా పోయి ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలు పెట్టారు.
హీరోల బర్త్‌డేకు సోషల్ మీడియాలో భారీ ట్వీట్స్ చేస్తూ రికార్డులు బద్దలు కొట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.నిన్న మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆరు కోట్ల ట్వీట్స్‌ను చేసి ఫ్యాన్స్ రికార్డు సృష్టించారు.
కేవలం 24 గంటల్లో ఆ స్థాయి రికార్డు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.ఆ రికార్డును మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బ్రేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నెలలో మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఉంది.అందుకు సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్‌కు ట్రెండ్ అలర్ట్ వెళ్లింది.
ప్రతి ఒక్కరు కూడా వేలల్లో ట్వీట్స్ రీ ట్వీట్స్ చేయాలని చెప్పారు.
చిరంజీవి బర్త్‌డేకు ఆ టార్గెట్ మిస్ అయినా వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు ఆ రికార్డును బద్దలు కొట్టాలనే నిర్ణయానికి వచ్చారు.మహేష్‌బాబు ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ప్రపంచ రికార్డును బ్రేక్ చేయాలంటే సులభమే అన్నట్లుగా మెగా ఫ్యాన్స్ ఉన్నారు.24 గంటల్లో వారి టార్గెట్ 7.5 కోట్లుగా తెలుస్తోంది.ఇది మరే హీరో ఫ్యాన్స్‌కు సాధ్యం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ టార్గెట్‌ను పెట్టినట్లుగా మెగా ఫ్యాన్స్ వర్గాల వారు చెబుతున్నారు.
అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం 6 కోట్ల టార్గెట్‌ను క్రాస్ చేయండి.ఆ తర్వాత 7.25 కోట్లు చేద్దురు అంటున్నారు.ఈ టార్గెట్‌ను మెగా ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.