మెగా ఫాన్స్ కు పెద్ద దెబ్బ..! సంక్రాతి కలిసి రావడంలేదా.? గతంలో కూడా ఇలాగే..?     2019-01-12   08:57:24  IST  Sai Mallula

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతికి కానుకగా ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది. కానీ మెగా ఫాన్స్ ఆశలు తారుమారారయ్యి.

గత ఏడాది లో రంగస్థలం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్..ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తుండడం తో సినిమాను చూసేందుకు పోటీ పడ్డారు. కానీ మొదటి రోజుకే సీన్ రివర్స్ అయ్యింది. పండగ సెలవుల్లో టికెట్ దొరకదు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆడియన్స్ అంతా సగంలోనే వెళ్లిపోతున్నారు. సినిమా చూసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపించలేదని తెలుస్తుంది.

Mega Fans Hurt With Vinaya Vidheya Rama Movie-Pawan Kalyan Ram Charan Sankrnathi 2019 Movie Talk

Mega Fans Hurt With Vinaya Vidheya Rama Movie

గత సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా కూడా అప్పట్లో భారీ ప్లాప్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇప్పుడు రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా కూడా అలాగే అవ్వడంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఒకప్పుడు సంక్రాంతికి మెగా స్టార్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే అది పక్క హిట్ అని ఉండేది…రీసెంట్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. కానీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ విషయంలో అది విఫలమైంది.