3 నెలలు మెగా ఫ్యాన్స్ కి పండుగే..!

Mega Fans Festival For Four Big Mega Movies

డిసెంబర్ నుండి రానున్న 3 నెలలు మెగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.డిసెంబర్ 17న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో వస్తున్నాడు.

 Mega Fans Festival For Four Big Mega Movies-TeluguStop.com

సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ అవుతుంది.ఇక జనవరిలో సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రాబోతుంది.

అయితే ఆర్.ఆర్.ఆర్ కు పోటీగా భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా వేసుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.సంక్రాంతికి మిస్సైతే జనవరి 25, 26 తేదీల్లో భీమ్లా నాయక్ రిలీజ్ ఉంటుందని టాక్.

 Mega Fans Festival For Four Big Mega Movies-3 నెలలు మెగా ఫ్యాన్స్ కి పండుగే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మరో పక్క మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమా అసలైతే డిసెంబర్ 24న రిలీజ్ ప్రకటించినా ఇప్పుడు ఆ డేట్ కు సినిమా రావడం కష్టమని అంటున్నారు.గని కూడా జనవరి లేదా ఫిబ్రవరి ఎండింగ్ కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఫిబ్రవరి 4న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ ఫిక్స్ చేశారు.కొరటాల శివ డైరక్షన్ లో చరణ్ కూడా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మొత్తంగా రానున్న 3 నెలల్లో నాలుగు మెగా సినిమాలు మెగా ఫ్యాన్స్ ను సూపర్ ఎంటర్టైన్ చేయనున్నాయి.వారం అటో ఇటో కాని మెగా హీరోల సినిమాలు రిలీజ్ పక్కా అని తెలుస్తుంది.

#Chiranjeevi #Pawan Kalyan #Hungama #Ghani #Fans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube