చరణ్‌, బోయపాటి మూవీ.. ఫ్యాన్స్‌ ఆందోళన     2018-06-16   01:09:12  IST  Raghu V

‘రంగస్థలం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత చరణ్‌ చేస్తున్న సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ను షూట్‌ చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని, ప్రస్తుతం చేస్తున్న యాక్షన్‌ సీన్స్‌ పూర్తి అయితే చిత్రీకరణ పాటలు మినహా మొత్తం పూర్తి అయినట్లే అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. షూటింగ్‌ ఇంత స్పీడ్‌గా చేయడం ఏంటని ప్రస్తుతం విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నాడు.

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు అంటే కనీసం ఆరు నెలల సమయం అయినా పడుతుంది. భారీ సెట్టింగ్స్‌, విదేశీ లొకేషన్స్‌, పెద్ద పెద్ద షెడ్యూల్స్‌ ఇలా అన్ని కలుపుకుని కనీసం ఆరు నెలల పాటు అయినా షూటింగ్‌ జరిపితేనే సినిమా బాగుంటుంది. అలా కాదని, కేవలం మూడు నెలల్లోనే బోయపాటి ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆశ్చర్యకరంగా మూడు నెలల్లోనే చరణ్‌ మూవీ షూటింగ్‌ పూర్తి అవ్వడం చూస్తే ఫ్యాన్స్‌ ఆందోళన పడుతున్నారు. ఇంత స్పీడ్‌గా పూర్తి అయిన ఈ సినిమా ఆకట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం వంటి మంచి సినిమా చేసిన చరణ్‌ తన తదుపరి చిత్రంతో డిజాస్టర్‌ చవి చూస్తాడా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.