మెగా హీరోల సినిమాల విషయంలో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్.. కారణం ఏంటి ?

ఒక సినిమా విజయాన్ని లేదా పరాజయాన్ని ఎవరు అంచనా వేస్తారు ? అందులో నటించే హీరో గత చిత్రాలు ఫ్లాప్ అయితే ఇప్పుడు నటిస్తున్న సినిమాలపై ఆ ప్రభావం ఉంటుందా? కేవలం హీరోలు మాత్రమే కాదు దర్శకులు, హీరోయిన్ ల విషయంలో కూడా ఇలాంటి కొన్ని సెంటిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి.గతంలో పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్ ఐరన్ లెగ్ గా ముద్ర వేస్తూ మళ్ళీ అదే హీరోయిన్ ని తమ సినిమాలో పెట్టుకోవడానికి హీరోలు, దర్శకులు వెనకడుగు వేస్తారు.

 Mega Fans Are In Tension ,vishwambhara, Trisha ,stalin, Ram Charan Tej , Chiran-TeluguStop.com

కొన్నిసార్లు పెట్టుకున్న ఆడియన్స్ సైతం దానిని బ్యాడ్ సెంటిమెంట్ గానే భావిస్తూ ఉంటారు.ప్రస్తుతం ఇలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ గురించి మెగా ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇంతకీ ఆ మెగా హీరోలు తీస్తున్న సినిమాలు ఏంటి? ప్లాప్ అయినా హీరోయిన్స్ ఎవరు ? ఏ సినిమాల కోసం వీరు పని చేస్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Chiranjeevi, Game Changer, Kiara Advani, Ram Charan Tej, Stalin, Trisha,

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా( Vishwambhara ) తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.త్రిష తో పాటు మరికొంతమంది కూడా నటీమణులు ఈ చిత్రంలో ఉండగా గతంలో మెగాస్టార్ చిరంజీవి మరియు త్రిష( Trisha ) కాంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చిన విషయం కూడా అందరికీ విదితమే.ఈ సినిమా అనుకున్నంత మేర కమర్షియల్ గా విజయాన్ని అందుకోలేదు.

దాంతో ఈ సెంటిమెంట్ ఇప్పుడు విశ్వంభర సినిమాపై కూడా పడుతుంది అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.గతంలో వీరి కాంబినేషన్లో ఒక ఫ్లాప్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఈ సినిమా పరాజయం అవుతుందా అంటే కచ్చితంగా కాదు.

Telugu Chiranjeevi, Game Changer, Kiara Advani, Ram Charan Tej, Stalin, Trisha,

ఇదే దోవలో మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్( Ram Charan Tej ) కూడా ఒక బ్యాడ్ సెంటిమెంట్ మోస్తున్నాడు.ప్రస్తుతం గేమ్ చెంజర్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు రామ్ చరణ్.ఆయన సినిమాలో అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.అయితే కియారా అద్వానీతో గతంలో వినయ విధేయ రామ( Vinaya Vidheya Rama ) అనే సినిమాలో నటించాడు రామ్ చరణ్.

ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.రామ్ చరణ్ కెరియర్ లో ఇది అత్యంత చెత్త సినిమాగా రికార్డు నమోదు చేసుకుంది.బోయపాటి దర్శకత్వంలో ఈ వచ్చిన ఈ సినిమా ద్వారా ఈ కాంబినేషన్ మొట్టమొదటిసారిగా కలిసిన నటించగా గేమ్ చేంజెర్ సినిమా కోసం శంకర్ మరోసారి కియారా అద్వాని( Kiara Advani )ని తీసుకొని బాగానే ధైర్యం చేసిన మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఎంతో కొంత అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే కంటెంట్ బాగుంటే సినిమాలు నడుస్తాయి కానీ ఇలా హీరోయిన్స్ విషయంలో సెంటిమెంట్స్ ఏంటి అని మరొక వర్గం మాట్లాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube