చిరంజీవిని గాలికి వదిలేసిన రామ్ చరణ్   Mega Fans Angry With Ram Charan’s Foreign Tour With Mahesh     2017-01-01   22:00:00  IST  Raghu V

ప్రస్తుతం రామ్ చరణ్ ఎక్కడున్నాడు? స్విట్జర్లాండులో. ఏం చేస్తున్నాడు ? సెలవులు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరితో? మహేష్ బాబుతో. ప్రాక్టికల్ గా, రామ్ చరణ్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? హైదరాబాదులో. ఏం చేస్తూ ఉండాలి? ఖైదీ నం 150 పనులు చూసుకోవడం, ప్రమోషన్స్ చేయడం. అదంతా ఎందుకు చేయాలి? తన తండ్రి 150వ సినిమా అని మాత్రమే కాదు, ఆ సినిమాకి తాను నిర్మాత కూడా కాబట్టి.

ప్రస్తుతం మెగాఫ్యాన్స్ ఆలోచనలు ఇలానే ఉన్నాయి. మెగాఫ్యాన్స్ పిచ్చి కోపంగా ఉన్నారు చరణ్ మీద. మహేష్ పరిస్థితి వేరు, షూటింగ్ లేదు కాబట్టి విదేశాలకు వెళ్ళాడు .. మరి రామ్ చరణ్ ఇన్ని పనులు పెట్టుకోని, చిరంజీవిని గాలికి వదిలేసి, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నట్లు అని అందోళనతో కూడిన ప్రశ్నలు సంధిస్తున్నారు మెగా అభిమానులు.

మ్యాటర్ లో లాజిక్ ఉంది. మరో పది-పదకొండు రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకోని, ఎంచక్కా మహేష్ తో విదేశాలు చుట్టేందుకు బయలుదేరాడు చెర్రి. మెగా ఫ్యాన్స్ బాధలో అర్థం ఉంది. కాని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నది అల్లు అరవింద్. మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో, పాఠాలు చెప్పే రేంజ్ ఆయనది, మరి భయమెందుకు.