వర్షం పాపకు చెమటలు పట్టిస్తున్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 Trisha, Chiranjeevi, Acharya, Mega Fans-TeluguStop.com

ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చిరు సరసన తొలుత అందాల భామ త్రిషను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.

అయితే సినిమాకు ఓకే చేసిన త్రిష, షూటింగ్ జరిగే సమయానికి ఈ సినిమా నుండి తప్పుకుంది.దీంతో ఖంగుతిన్న చిత్ర యూనిట్ వెంటనే కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు.

కాగా త్రిష చిరు సినిమాను కాదని ఇప్పుడు మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది.మాస్‌రాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోయే సినిమాలో త్రిష నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆమెపై మండి పడుతున్నారు.

చిరంజీవి లాంటి స్టార్ హీరో పక్కన చేసే ఛాన్స్ వదులుకుని ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకుని తెలుగు సినిమా చేస్తున్నావంటూ మెగా ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి మెగా ఫ్యాన్స్‌కు త్రిష ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube