వైష్ణవ్‌ తేజ్‌ పై మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సాయి ధరమ్‌తో పోల్చితే..!

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు తెరంగేట్రం చేశారు.కాని కొందరు మాత్రమే స్టార్‌ డం ను దక్కించుకున్నారు.

 Mega Fans About Uppena Movie And Viashnav Tej, Sai Dharam Tej, Uppena, Vaishnav-TeluguStop.com

కళ్యాణ్‌ దేవ్‌ మరియు అల్లు శిరీష్‌ వంటి వారు ఇంకా మొదటి కమర్షియల్‌ సక్సెస్ కోసం తాపత్రయ పడుతున్నారు.ఇలాంటి సమయంలో వచ్చిన వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెన సినిమా తో సక్సెస్‌ దక్కించుకున్నాడు.

ఈయన ఎలాంటి ఇమేజ్‌ ను దక్కించుకుంటాడు.ఎలా ఈయన కెరీర్‌ ఉంటుంది అంటూ అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

ఏడాది కాలంగా ఎదురు చూసిన ఉప్పెన సినిమా వచ్చేసింది.మొదటి సినిమా కే చాలా పెద్ద భారం ను వైష్ణవ్‌ తేజ్ పై దర్శకుడు బుచ్చి బాబు పెట్టాడు.

ఆ భారంను ఏమాత్రం తడబడకుండా మోయడంతో పాటు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు.అంతే కాకుండా ఇతర హీరోలు ఏమాత్రం ఒప్పుకోనటువంటి పాత్రను సన్నివేశంను ఈ సినిమా కోసం ఒప్పుకున్నాడు.

వైష్ణవ్ తేజ్‌ హీరోగా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని గురించి మొదటి ఆట చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.పెద్ద ఎత్తున వైష్ణవ్‌ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.

ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో వైష్ణవ్ తేజ్‌ నటన పీక్స్‌ లో ఉంది.మామలను మించే అల్లుడు అన్నట్లుగా వైష్ణవ్‌ పేరు తెచ్చుకుంటాడని ఎవరో ఫ్రీ రిలీజ్ వేడుక సందర్బంగా అన్నారు.

ఆ రేంజ్ కాకున్నా కూడా మామల పరువు తీయకుండా చక్కని ప్రదర్శణ అయితే వైష్ణవ్‌ నుండి వచ్చిందని అభిమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.వైష్ణవ్‌ నుండి వస్తున్న వరుస సినిమాలు ఇక పై మెగా ఫ్యాన్స్ కు ఫుల్‌ మీల్స్ ను అందిస్తాయని ఆశిస్తున్నామని అంటున్నారు.

అనతి కాలంలోనే అన్న సాయి ధరమ్‌ తేజ్ ను క్రాస్‌ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటున్నారు.

Telugu Allu Sirish, Chiranjeevi, Fans, Kalyan Dev, Sai Dharam Tej, Telugu, Uppen.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube