పవన్ కి 'మెగా' అండ ఉండబోతోందా...?  

Mega Family Support To Jana Sena-mega Family,nagababu,pawan Kalyan,ram Charan

జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతానికి కాస్త గందరగోళంగా ఉండడం ఎన్నికలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో ఏదో ఒక మ్యాజిక్ జరిగితే కానీ పదుల సంఖ్యలో సీట్లు దక్కే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీ కాస్త ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కి ‘మెగా’ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది అనే చర్చ మొదలయ్యింది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు పవన్ కి సపోర్ట్ గా యూట్యూబ్ ఛానెల్ ద్వారా పవన్ ప్రత్యర్థులకు ఘాటుగా సమాధానం ఇస్తున్నాడు. అయితే ఒక్క నాగబాబు సపోర్ట్ మాత్రమే పవన్ కి సరిపోతుందా అనే అనుమానం కలుగుతోంది...

పవన్ కి 'మెగా' అండ ఉండబోతోందా...? -Mega Family Support To Jana Sena

ఎందుకంటే ఇప్పుడు జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులు మూడొంతులు మంది కొత్తవారే.

ఇప్పటి వరకూ రామ్ చరణ్ కూడా చాలాసార్లు బాబాయ్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధమే. బాబాయ్ పిలిస్తే ఏమైనా చేస్తా అంటూ అనేక సందర్భాల్లో చెప్పాడు.

అయితే పవన్ తనకు తానుగా ప్రచారానికి రావాల్సిందిగా ఎవరినీ పిలవాడు. ఇది మెగా ఫ్యామిలీకి కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు పవన్ పిలుపుకోసం నాగబాబు, చరణ్, చిరంజీవి ఎదురుచూస్తూ కూర్చుంటారా లేదంటే తమకు తాముగా రంగంలోకి దిగి తమ్ముడి పార్టీ విజయానికి కృషి చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ ఎన్నికల్లో జనసేన తరపున రంగంలోకి దిగేందుకు చూస్తున్నాడు. ఉభయగోదావరి జిల్లాల్లోని ఏదో ఒక బలమైన నియోజకవర్గంలో పోటీ చేయాలని చూస్తున్నాడు.

ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ టికెట్ ఆశించి పార్టీలోకి వస్తే.

పవన్ రియాక్షన్ మరోలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే పవన్ తన స్నేహితుడైన అలీకే పవన్ చోటివ్వలేదు. ఇప్పుడు అన్నయ్యకు సీటిస్తే...

మళ్లీ ఇది కుటుంబ పార్టీగా ముద్రపడిపోతుందన్న భయం పవన్‌కి కి కూడా ఉంది. మరోవైపు మెగా కుటుంబం నుంచి పవన్‌కి ఎలాంటి సపోర్ట్ ఉండబోతోంది అనేదీ త్వరలో తేలిపోనుంది.

చిరంజీవి జనసేనలోకి వస్తారని, ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉంటారని చెప్పుకున్నారు. అయితే ఇప్పట్లో ఆ అవకాశాలు లేనట్టే. ఈసారి చిరంజీవి జనసేనకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

అయితే రామ్ చరణ్ ప్రచారానికి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.