మెగా ఫ్యామిలీ వేసిన ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యేనా?

గతంలో ఎప్పుడు లేని పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్‌లో నెకొంది.కాస్టింగ్‌ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన వ్యవహారం బడా సినీ ప్రముఖులు కూడా స్పందించే వరకు వచ్చింది.

 Mega Family Publicity Plan-TeluguStop.com

మీడియాపై సినిమా పరిశ్రమ యుద్దం ప్రకటించే వరకు వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి విషయమై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

సినిమా పరిశ్రమ పరువు తీసే విధంగా సినిమా వారిపై దారుణమైన కథనాలు అల్లుతూ న్యూస్‌ ఛానెల్స్‌లో కథనాలు ప్రసారం అయ్యాయి.వాటికి వ్యతిరేకంగా ప్రస్తుతం సినిమా పరిశ్రమ ప్రముఖులు నడుం భిగించారు.

కొన్ని న్యూస్‌ ఛానెల్స్‌ మొదటి నుండి కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా కథనాలు రాస్తూ వచ్చింది.అప్పట్లో చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారం నుండి నిన్న మొన్నటి శ్రీరెడ్డి వ్యాఖ్యల వరకు మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ మీడియా సంస్థలు వార్తలు ప్రస్తారం చేస్తూ వస్తున్నాయి.

ఈ కారణంగానే కొన్ని మీడియా సంస్థలను బ్యాన్‌ చేయాలని మెగా ఫ్యామిలీ మొదటి నుండి కోరుతూ వస్తుంది.తాజాగా పవన్‌ తన తల్లిపై చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా ఛానెల్స్‌ పదే పదే ప్రసారం చేయడం దారుణం అంటూ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆందోళనకు దిగాడు.

ఫిల్మ్‌ ఛాంబర్‌లో పవన్‌ ఆందోళన చేయడం వల్ల సినిమా పరిశ్రమ అంతా కదిలింది. తాజాగా చిరంజీవి పిలుపు మేరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన దాదాపు అందరు హీరోలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లో భేటీ అయ్యారు.

నాగార్జున, ప్రభాస్‌లు ఇతర దేశాల్లో ఉండటం వల్ల వారు రాలేక పోయారు.బాలకృష్ణ టీడీపీకి అనుకూలంగా ఉండటం వల్ల ఆయన భేటీలో పాల్గొనలేదు.

ఇక భేటీ విషయానికి వస్తే గత కొంత కాలంగా సినిమా వారిపై అసత్య ప్రచారం చేస్తూ, నీచమైన కామెంట్స్‌ చేస్తూ పబ్బం గడుపుకుంటున్న న్యూస్‌ ఛానెల్స్‌ను బ్యాన్‌ చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తుంది.అదే విషయాన్ని తాజాగా హీరోల భేటీలో చిరంజీవి ఉంచినట్లుగా తెలుస్తోంది.
డైరెక్ట్‌గా కొన్ని ఛానెల్స్‌ను బ్యాన్‌ చేయాలని ప్రస్థావన తీసుకు రాకుండా ఆ ఛానెల్స్‌ వల్ల పరిశ్రమకు నష్టం అని, వాటికి దూరంగా ఉండాలని చిరంజీవి చెప్పుకొచ్చాడు.ఆ విషయమై హీరోలు చర్చించారు కూడా.

మరోసారి ఆ విషయం గురించి చర్చించి చివరకు ఒక నిర్ణయానికి రావాలని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.మీడియాను బ్యాన్‌ చేయడం వల్ల సినిమా పరిశ్రమపై మరింతగా బురద జల్లే వ్యవహారం సాగుతుందని కొందరు భయపడుతున్నారు.

మరి కొందరు మీడియాను బ్యాన్‌ చేయాల్సినంత పని ప్రస్తుతం లేదని, మీడియాను కాస్త హద్దుల్లో ఉంచితే సరిపోతుందని కొందరు భావించారు.చివరకు మెగా క్యాంప్‌ వేసిన ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యేనా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube