మిస్సెస్ అవ్వబోతున్న మిస్ నిహారిక... వరుడు ఎవరో తెలుసా..?

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదల వివాహం గురించి కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి అన్న విషయం విదితమే.సినిమాలో తెరంగేట్రం చేసి స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకోవాలని నిహారిక కొణిదెల ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఆమెలో హీరోయిన్ మెటీరియల్ లేదని ప్రేక్షకులు చెప్పకనే చెప్పారు.

 Mega Family Niharika Varun Tej-TeluguStop.com

దాంతో నాగబాబు తన కూతురికి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలనే యోచనలో ఎప్పటినుండో ఉన్నాడని తెలుస్తోంది.కానీ మెగా డాటర్ పెళ్లి గురించి అధికారికంగా ఇప్పటివరకు ఏ విషయము బయటికి రాలేదు.

తండ్రి నాగబాబు గానీ అన్నయ్య వరుణ్ తేజ్ గాని నిహారిక పెళ్లి ఎవరితో ఎప్పుడు అవబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన సందర్భమే లేదని చెప్పుకోవచ్చు.

అయితే తాజాగా నిహారిక కొణిదెల తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మిస్ నిహారిక మిస్సెస్ నిహారిక అవబోతుందా? అని ఒక కాఫీ కప్ పై బ్లాక్ మార్కర్ పెన్ తో రాసిన ఫోటోని పోస్ట్ చేసి అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చింది.ఆ పోస్ట్ కి ‘ఏంటి ఇది నిజమా? అన్నట్టు ఒక కామెంటు కూడా జత చేసింది.దీంతో అభిమానులు ఆమెకి పెళ్లి కుదిరినట్టు భావించి వరుడు ఎవరో చెప్పాలంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

మరికొంతమంది మాత్రం కంగ్రాచులేషన్స్ అంటూ ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.మమ్మల్ని ఎందుకు పిలవలేదంటూ సెలబ్రిటీలు కూడా నిహారిక కొణిదెల పోస్ట్ పై స్పందిస్తున్నారు.

ఈ పోస్ట్ నిజంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ శీర్షిక పేరు అన్న విషయం తెలియాల్సి ఉంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube