మెగా జోరు మామూలుగా లేదుగా.. డిసెంబర్ లో మరో మెగా మూవీ

కరోనా వల్ల నిలిచి పోయిన సినిమాలు మెల్ల మెల్లగా విడుదల అవుతున్నాయి.పెద్ద ఎత్తున సినిమాలు నవంబర్ నుండి మొదలు కాబోతున్నాయి.

 Mega Family Movies Coming Back To Back Details, Acharya, Chiranjeevi, Gani, Movi-TeluguStop.com

ఈ నెలలో కూడా విడుదల ఉన్నాయి.కాని మెగా మూవీస్ అంటే పెద్ద సినిమాలు అన్ని కూడా వచ్చే నెల నుండి పునః ప్రారంభం కాబోతున్నాయి.

ఇప్పటికే ఆచార్య సినిమా విడుదల తేదీని డిసెంబర్ లో ప్రకటించారు.డిసెంబర్ లో పుష్ప సినిమా కూడా విడుదల ఉంటుందని అంటున్నారు.

అయితే ఆచార్య నేపథ్యం లో పుష్ప ను వాయిదా వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.ఆ విషయాన్ని పక్కన పెడితే డిసెంబర్‌ లో మరో భారీ సినిమా విడుదల అవ్వబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

మెగా మూవీ గని ని డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

గని సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా సాయి మంజ్రేకర్‌ హీరోయిన్ గా నటించింది.

ఉపేంద్ర వంటి కన్నడ స్టార్‌ ఈ సినిమాలో నటించడంతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్న నేపథ్యంలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్‌ 3వ తారీకున విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రకటించారు.

Telugu Acharya, Allu Aravind, Chiranjeevi, Gani, Heroes, Pushpa, Ram Charan, Tol

డిసెంబర్‌ లో మెగాస్టార్‌ మూవీ కూడా ఉంది.ఒకే నెలలో రెండు మెగా మూవీస్ వరుసగా వస్తున్నాయి.అక్టోబర్ లో సాయి ధరమ్‌ తేజ్ మరియు వైష్ణవ్‌ తేజ్ ల సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్‌ లో వచ్చాయి.డిసెంబర్ లో చిరంజీవి మరియు వరుణ్‌ తేజ్ ల సినిమాలు కేవలం రెండు వారాల గ్యాప్ లో రాబోతున్నాయి.

చిరంజీవి ఆచార్య తర్వాత చరణ్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ జనవరిలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.మొత్తానికి మెగా సందడి మొదలు అయినందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube