జ‌న‌సేనలోకి మెగా ఫ్యామిలీ.. టీడీపీ, వైసీపీల ప‌రిస్థితి ఏంటి?

మ‌రో ఏడాదిలోనే ఏపీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అధికార టీడీపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

 Mega Family Intojanasena-TeluguStop.com

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి ఎన్నికై చ‌రిత్ర సృష్టించాల‌ని చంద్ర‌బాబు, అదే ఎన్నిక‌ల ద్వారా ఇప్పుడైనా అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్‌.తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ధ‌ర్మ‌పోరాట దీక్ష స‌భల పేరుతో చంద్ర‌బాబు ఏకంగా ఎన్నికల ప్ర‌చారం చేసేస్తున్నారు.ఇక‌, జ‌గ‌న్ మ‌రింత ముందు చూపుతో.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హిస్తూ.ప‌రోక్షంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే, వీరికి సినీ గ్లామ‌ర్ అనుకున్న స్థాయిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.టీడీపీ ఒకే ఒక్క‌డు అన్న‌ట్టుగా బాల‌కృష్ణ ఉన్నా.ఆయ‌న పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసే అవ‌కాశం త‌క్కువే.ప్ర‌స్తుతం ఆయ‌న సినిమా షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నాడు.ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.ఈ పార్టీ రోజా త‌ప్ప ఎవ‌రూ లేరు.

ఆమె ప్ర‌చారం కూడా అంతంత మాత్ర‌మే.దీంతో ఈ రెం డు పార్టీల‌కూ సినీ గ్లామ‌ర్ పెద్ద‌గా ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సినీ గ్లామ‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యా ణ్‌ను వాడుకున్న సంగ‌తి తెలిసింది.

అయితే, ఇప్పుడు టీడీపీకి పెద్ద‌గా సినీ గ్లామ‌ర్ క‌లిసొచ్చే ఛాన్స్ అంత‌గా క‌నిపించ డం లేదు.

ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.ప్ర‌జ‌ల్లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోనే పార్టీ పెట్ట‌డంతో అభిమానులు, కీల‌క‌మైన యువ‌త ఆయన వెంట న‌డిచే అవ‌కాశం ఉంది.

దీనికితోడు కాపు వ‌ర్గం మొత్తంగా ప‌వ‌న్‌కు అనుకూలంగా మారినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నిలేదు.ఇన్ని అనుకూల‌తలు ఉన్నాయి.

ఇక‌, ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ మెగా ఫ్యామిలీ కూడా జ‌న‌సేన‌లోకి నెమ్మ‌దిగా ఎంట్రీ ఇస్తున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి.

దీంతో రెండు ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల్లో క‌ల‌వ‌రం ప్రారంభ‌మైంది.

దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు యువ తను ఆక‌ర్షించేందుకు నిరుద్యోగ భృతి అంశాన్ని నేడో రేపో స్వ‌యంగా ప్ర‌క‌టించేందుకు రెడీ అయ్యార‌నే స‌మాచారం అందుతోంది.ఇక‌, వైసీపీ అధినేత కూడా యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే, మ‌గ‌ధీరుడు చెర్రీ ఎంట్రీ జ‌న‌సేన‌కు మ‌రింత ఆక్సిజ‌న్ అందిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల విడుద‌లైన రంగ స్థ‌లం సూప‌ర్ డూప‌ర్ హిట్‌తో ఆయ‌న అటు యువ‌త‌లోనే కాకుండా ఫ్యామిలీల‌కు కూడా దగ్గ‌ర‌య్యారు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప‌క్షాన చెర్రీ మైకందుకుంటే.టీడీపీ ఓట్లు చీలే అవ‌కాశం ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

మ‌రి రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు అనే నానుడి ఎలాగూ ఉంది కాబ‌ట్టి.చెర్రీ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube