మెగా ఫ్యామిలీ అంతా దిగబోతుందట!     2018-06-11   00:09:31  IST  Raghu V

మెగా ఫ్యామిలీ హీరో సినిమా ఫంక్షన్‌ అంటే మెగా హీరోలు హాజరు అవుతారనే ఉద్దేశ్యంతో మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇద్దరు, ముగ్గురుకు మించి మెగా హీరోలు కనిపిస్తారు. ఇప్పుడు కళ్యాణ్‌ హీరోగా పరిచయం కాబోతున్న ‘విజేత’ మూవీ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా కదిలి రాబోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రిజ భర్త అయిన కళ్యాణ్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కిన విషయం తెలిసింది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కావచ్చింది. సినిమాను జులైలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

ఇటీవలే ‘విజేత’ ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుకను భారీ మెగా వేడుకగా నిర్వహించాలని నిర్మాత సాయి కొర్రపాటి కోరుకుంటున్నాడు. అందుకోసం చిరంజీవి, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, నాగబాబు, వరుణ్‌ తేజ్‌, నిహారిక ఇంకా పలువురు మెగా ఫ్యామిలీ నుండి హాజరు కాబోతున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే పవన్‌ కళ్యాణ్‌ కూడా ఈ మెగా ఈవెంట్‌లో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి ఫ్యామిలీ నుండి ఏ హీరో పరిచయం కాబోతున్నా కూడా ఇలాగే గ్రాండ్‌గా ఎంట్రీ ఉంటుంది.