మెగా ఫ్యామిలీ నుండి 15 సినిమాలు రెడీ

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా గత ఏడు నెలలుగా థియేటర్లు మూతబడి ఉన్నాయి.థియేటర్లు క్లోజ్‌గా ఉండటం వల్ల సినిమాలు విడుదల అన్ని వాయిదాలు పడుతూ వచ్చాయి.థియేటర్లు ఓపెన్‌కు కేంద్రం నుండి అనుమతి వచ్చినా కూడా ఇంకా థియేటర్లను తెరిచేందుకు యాజమాన్యాలు సిద్దంగా లేరు.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్‌ చేయడం వల్ల నష్టాలు తప్ప లాభాలు ఉండవని.దానికి తోడు జనాలు ఇంకా కరోనా భయంతో ఉన్నారు.అందుకే కరోనా భయం పోయే వరకు థియేటర్లను ఓపెన్‌ చేయవద్దంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Mega Family 15 Movies Coming Next Year Starting   Chiranjeevi, Mega Family, Kaly-TeluguStop.com

అందుకే చాలా సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి మరియు సమ్మర్‌కు వాయిదా పడ్డాయి.మొత్తానికి పెద్ద చిన్న సినిమాలు కలిసి వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు వంద వరకు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది.

అందులో మెగా మూవీస్‌ ఏకంగా 15 ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆరంభం నుండి వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు మెగా ఫ్యామిలీకి చెందిన సినిమాలు కంటిన్యూస్‌గా 15 విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

చిరంజీవి నుండి మొదలుకుంటే కళ్యాణ్‌ దేవ్‌ వరకు వరుసగా సినిమాలు ఉండబోతున్నాయి.చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు వేదాళం సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల కాబోతున్నాయి.

పవన్‌ కళ్యాన్‌ వకీల్‌ సాబ్‌ మరియు మరో రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.ఇక సాయి ధరమ్‌ తేజ్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లు కూడా సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అతి త్వరలోనే సినిమా థియేటర్లు యథావిధిగా ప్రారంభం అయితే పర్వాలేదు.కాని వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సినిమా థియేటర్లు ఓపెన్‌ కాకుంటే మాత్రం మెగా హీరోల సినిమాలు అన్ని ఒక్కసారి బాక్సాఫీస్‌ వద్ద దండయాత్ర చేస్తే ఇతర సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube