ఓటీటీపై ఆసక్తి చూపిస్తున్న చిరంజీవి పెద్ద కూతురు

మెగాస్టార్ చిరంజీవి కూతురుగా ఇండస్ట్రీలో అందరికి సుపరిచితం అయిన సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఈ మధ్య తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తుంది.ఇప్పటికే మెగా హీరోల సినిమాలకి ముఖ్యంగా చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత పని చేస్తుంది.

 Mega Daughter Sushmita Concentrate On Ott, Tollywood, Megastar, Chiranjeevi, Tel-TeluguStop.com

ఓ వైపు ఈ ప్రొఫెషన్ లో ఉంటూనే తాను కూడా సినిమా వ్యాపారంలోకి అడుగుపెట్టాలని ఈమె ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో ప్రస్తుతం భూమ్ లోకి వస్తున్న ఓటీటీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుందనే మాట గట్టిగా వినిపిస్తుంది.

ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ యాప్ ఒకటి స్టార్ట్ చేసి కొత్త సినిమాలు కొని రిలీజ్ చేస్తున్నాడు.అలాగే వెబ్ సిరీస్ లు కూడా ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో ఈ ఆహా లేకపోయినా మెల్లగా పుంజుకుంటుంది.అయితే ఇప్పుడు మెగా డాటర్ సుస్మిత కూడా ఏకంగా ఒక ఓటీటీ యాప్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు వినిపిస్తుంది.

ఒక వేళ అది కుదరకపోతే నిర్మాతగా వెబ్ సిరీస్ లు నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం.మరి ఈ రెండింటిలో మెగా డాటర్ ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube