వైష్ణవ్ తేజ్ ను కోరకబోయిన నిహారిక.. బర్త్ డే విష్ చేస్తూ క్యూట్ వీడియో షేర్ చేసిన మెగా డాటర్?

Mega Daughter Shared Cute Video By Wishing To Vaishnav Tej

టాలీవుడ్ నటి, మెగా ప్రిన్సెస్ నాగబాబు కూతురు నిహారిక గురించి అందరికీ తెలిసిందే.మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Mega Daughter Shared Cute Video By Wishing To Vaishnav Tej-TeluguStop.com

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో అంతగా కొనసాగలేక పోయింది.అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోయింది.

దీంతో తాను సినిమాలకు దూరంగా ఉంటుంది.

 Mega Daughter Shared Cute Video By Wishing To Vaishnav Tej-వైష్ణవ్ తేజ్ ను కోరకబోయిన నిహారిక.. బర్త్ డే విష్ చేస్తూ క్యూట్ వీడియో షేర్ చేసిన మెగా డాటర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో ఒక మనసు సినిమా ద్వారా పరిచయం అయింది.

ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సైరా నరసింహారెడ్డి, సూర్యకాంతం వంటి సినిమాలలో నటించింది.కానీ ఈ సినిమాలు ఏవి తనకు అంత సక్సెస్ ఇవ్వకపోయినా తన నటనకు మాత్రం ఎంతో కొంత గుర్తింపు సొంతం చేసుకుంది.

తమిళంలో కూడా ఓ సినిమాలో నటించింది.అలా 2019లో చివరిసారి గా నటించింది.

ఇక నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత బాగా యాక్టివ్ గా మారింది.నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

తన భర్తతో కలిసి తెగ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు తన కొత్త కొత్త లుక్ లతో తన ఫాలోవర్స్ ని బాగా ఫిదా చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన ఫాలోవర్స్ తో నిత్యం టచ్ లో ఉంటూ వారితో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు పలు ఆన్లైన్ ప్రకటనలు కూడా చేస్తూ ఉంటుంది.

ఇక తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.తన భర్త తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఈ మధ్య పలు వెబ్ సిరీస్ లలో కూడా చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసుకుంది.అందులో వైష్ణవ్ తేజ్ తో సరదాగా గడుపుతున్నట్లు కనిపించింది.వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నిహారిక ఆయనతో కాసేపు ఆటలు ఆడుతూ బర్త్ డే విష్ చేసింది.

వీడియోలో వైష్ణవ్ ను కోరకాలని చూసింది.కానీ మళ్లీ వెనకకు జరిగింది.ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయి మంచి సక్సెస్ అందుకున్నాడు.ఆ తర్వాత నటించిన కొండపొలం సినిమా లో కూడా మంచి హిట్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమాల కంటే ముందు బాలనటుడుగా పరిచయమయ్యాడు.

ఇక ప్రస్తుతం ఈయన ఖాతాలో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా ఉండగా.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మరో సినిమాతో బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమాలతో వైష్ణవ్ తేజ్ ఎటువంటి సక్సెస్ లు అందుకుంటాడో చూడాలి.

#Uppena #Niharika #Vaishnav Tej #NiharikaWishes #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube