సంచలన నిర్ణయం తీసుకున్న నిహారిక  

ఫుల్ టైం ప్రొడ్యూసర్ గా మారుతున్న నిహారిక..

Mega Daughter Niharika Turned As A Producer For Movies-mega Family,movies,telugu Cinema,tollywood,turned As A Producer

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. ఈ భామ ఒక మనసు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకున్న నిహారికకి అదృష్టం అస్సలు కలిసి రాలేదు..

సంచలన నిర్ణయం తీసుకున్న నిహారిక-Mega Daughter Niharika Turned As A Producer For Movies

ఆమె చేసిన మూడు సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దీనికి కారణం ఆమె పాత్ర స్వభావంకి విరుద్ధమైన పాత్రలు ఎంచుకోవడం, అలాగే పాతబడిన మూస కథలని తీసుకొని కొత్తరకంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేయడంతో ఆ సినిమాలు షార్ట్ ఫిలింకి ఎక్కువ, ఫీచర్ ఫిలిమ్స్ కి తక్కువ అన్న విధంగా తయారయ్యాయి. దీంతో ఈ భామ హీరోయిన్ గా చేసిన ప్రయత్నాలు అన్ని కూడా బెడిసికొట్టాయి.

మెగా ఫాన్స్ కూడా నిహారిక సినిమాలని కాపాడలేకపోయారు. ఈ నేపధ్యంలో నిహారిక తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక నటిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్మాణ రంగంలోకి దిగడానికి సిద్ధమవుతుంది.

ఇప్పటికే తాను సొంతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి వెబ్ సిరిస్ లని తీస్తుంది. ఇప్పుడు ఇదే బ్యానర్ మీద సినిమాలు కూడా తీయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తండ్రి బాటలో నిర్మాతగా సక్సెస్ అవ్వాలని నిహారిక స్కెచ్ వేసి మొదటి సినిమానే మెగా హీరోతో ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ఇప్పుడున్న మెగా హీరోలలో ఎవరితో తీస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.