నిహారిక 'నో' ప్రకటన పై మెగా ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

మెగా డాటర్ నిహారిక ఇటీవలే జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.ఆమె తో వివాహం అయిన తర్వాత చైతన్య మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు.

 Mega Daughter Niharika Husband Jonnalagadaa Chaitanya Not Entering To Movies, Ni-TeluguStop.com

అదే సమయంలో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది హీరోలు ఉన్నారు.

చిరంజీవి కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ దేవ్‌ కూడా హీరోగా పరిచయం అయ్యాడు.కాని ఆయన మాత్రం సినిమా లో సక్సెస్‌ అవ్వలేక పోతున్నాడు.

ముందు ముందు అయినా సినిమాలతో అలరిస్తాడా అంటే ఏమో అంటూ స్వయంగా మెగా అభిమానులు చెబుతున్నారు.ఫేసియల్‌ ఎక్స్‌ ప్రెషన్స్ ఇవ్వలేని మెగా అల్లుడు హీరోగా పనికి రాడు అంటున్నారు.

ఇక చైతన్య విషయానికి వస్తే చూడ్డానికి చాక్లెట్‌ బాయ్ గా అనిపించే ఇతడు ముందు ముందు పెద్ద సినిమాలే చేస్తాడేమో అనుకున్నారు.కాని అతడి ఎంట్రీ గురించి నిహారిక క్లారిటీ ఇచ్చింది.

చైతన్య సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా అంటూ ఆమెను ప్రశ్నించిన సమయంలో పూర్తి గా స్పష్టమైన సమాధానం ఇచ్చింది.చైతన్య కు సినిమాలు అంటే చాలా ఇష్టం.

ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటాడు.కాని సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఆయనకు అస్సలు లేదు.

ఎట్టి పరిస్థితుల్లో కూడా చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకోవడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌ తేజ్‌ సక్సెస్‌ అయినట్లేగా అనిపిస్తుంది.

కాని చైతన్య ఎంట్రీ విషయమై ఎవరు ఆసక్తిగా లేరు.కనుక నిహారిక తాజాగా చైతన్య సినీ రంగ ప్రవేశం గురించి చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ పెద్దగా నిరుత్సాహం పడటం లేదు.

ఆమె కనుక త్వరలో చైతన్య సినిమా వస్తుంది అంటే అప్పుడు అభిమానులు టెన్షన్‌ పడే వారేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Kalyan Dhev, Niharika, Telugu, Telugu Telugu, Tollywood, Uppena, Vaishnav .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube