నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ ... ఆగష్టులోనే

మెగా ఫామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న నటి కొనెదల నిహారిక.నాగబాబు కూతురుగా ఆమె వెబ్ సిరీస్ లతో ముందుగా కెరియర్ ప్రారంభించింది.తరువాత యాంకర్ గా కూడా మారింది.అక్కడ సక్సెస్ అయిన నిహారికకి సినిమాల ద్వారా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ దొరకలేదు.ఆమె చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.అయితే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నిహారికా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ విషయాన్ని ఆమె అఫీషియల్ గా ద్రువీకరించింది.చిరంజీవి అత్యంత సన్నిహితుడు గుంటూరు లో ఐజీగా పని చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కొడుకు వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది.

 Niharika Engagement Date Fix, Jonnalagadda Chaitanya, Mega Daughter, Mega Family-TeluguStop.com

చిరంజీవి ముందుండి ఈ సంబంధాన్ని కలిపాడు.ఎన్నాళ్ల నుంచో రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకున్నారు.

పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత చైతన్య, నిహారిక జంట సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులు వైరల్ అయ్యాయి.కొద్ది రోజుల క్రితం చైతన్య పుట్టిన రోజు సందర్భంగా నిహారిక అతనికి కవిత్వంతో స్పెషల్ విషెస్ చెప్పింది.

ఇదిలా ఉంటే త్వరలోనే ఈ ఇద్దరి నిశ్చితార్థం కూడా జరగబోతుంది.కరోనా నేపథ్యంలో అన్ని నియమాలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంగేజ్‌మెంట్ ప్లాన్ చేస్తున్నారు.

నిశ్చితార్థం ఆగస్ట్ 13న జరగనుందని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది.మరోవైపు పెళ్లి మాత్రం డిసెంబర్‌లో అనుకున్నా పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube