నిహారికకు ఎప్పుడు అదే పని.. ఫోటోతో అసలు విషయాన్నీ బయటపెట్టిన భర్త చైతూ?

Mega Daughter Husband Chaitanya Complaints Niharika Konidela Photo

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తన చిలిపి చిలిపి మాటలతో అల్లరితో ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

 Mega Daughter Husband Chaitanya Complaints Niharika Konidela Photo-TeluguStop.com

మెగా ఫ్యామిలీకి ముద్దుల కూతురుగా ఈమె సుపరిచితమే.ఇదిలా ఉంటే గత సంవత్సరం డిసెంబర్ 9న ఈమె జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.ఇక డిసెంబర్ 9 వారి ఫస్ట్ వెడ్డింగ్ అనివర్సరీ సందర్భంగా ఈ దంపతులిద్దరూ స్పెయిన్ కు పయనమయ్యారు.

 Mega Daughter Husband Chaitanya Complaints Niharika Konidela Photo-నిహారికకు ఎప్పుడు అదే పని.. ఫోటోతో అసలు విషయాన్నీ బయటపెట్టిన భర్త చైతూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం నిహారిక, చైతన్య వెకేషన్ లో ఉన్నారు.అక్కడ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

స్పెయిన్, బార్సీలోనాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ, అక్కడ షాపింగ్ చేస్తూ, అక్కడి అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫొటోలు దిగారు.ఈ ఫోటోలను నిహారిక ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే నిహారిక చైతన్యలు స్కై డ్రైవింగ్ గురించి మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telugu Chaitanya, Anniversary, Niharika-Movie

ఈ జంట అక్కడ ఒక హోటల్ కి డిన్నర్ చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.హోటల్ కి వెళ్లి అక్కడ తినకుండా నిహారిక తన ఫోన్ లో బిజీగా ఉంది.

అప్పుడు భర్త చైతన్య తన సెల్ఫీ తీస్తూ ఎప్పుడూ ఇదే పని ప్రతిక్షణం ఫోన్ లో ఇలా బిజీగా ఉంటుంది అంటూ నిహారిక మీద ఫిర్యాదు చేశాడు.అలాగే నిహారిక ఫోన్ చూస్తున్నా మరొక ఫోటోని కాసేపటికి షేర్ చేస్తూ కొన్ని మిలియన్ల క్షణాల తర్వాత అంటూ కాప్షన్ ఇచ్చాడు.

ఈ దంపతులు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.త్వరలోనే వీరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నెటిజన్లు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

#Anniversary #Niharika #Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube