మెగా డాటర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ నిజమా?

మెగా ఫ్యామిలీ నుండి పలువురు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.కాని హీరోయిన్‌గా మాత్రం ఒన్‌ ఓన్లీ నిహారిక ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

 Mega Daughter Enter In Bollywood-TeluguStop.com

ఆమె ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లు మరియు షార్ట్‌ ఫిల్మ్‌లు చేస్తుంది.హీరోయిన్‌గా చేసిన రెండు మూడు సినిమాలు కమర్షియల్‌గా ఆకట్టుకోలేక పోయాయి.

దాంతో ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌ల్లో ప్రయత్నిస్తుంది.నటించాలనే మక్కువ ఎక్కువ ఉన్న నిహారిక త్వరలో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Bollywood, Enter Bollywood, Nikharikha Web, Web Latest-Movie

  ఇటీవల నిహారిక మూడు రోజుల పాటు ముంబయిలో ఉంది.అక్కడ ఆ సమయంలో నిహారికకు స్క్రీన్‌ టెస్ట్‌ చేయడంతో పాటు ఫొటో షూట్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.బాలీవుడ్‌లో తెలుగు దర్శకుడు ఒకరు చేయబోతున్న సినిమాలో నిహారికను కీలక పాత్రకు తీసుకునే ఉద్దేశ్యంతో ఉన్నాడట.అందుకే అక్కడకు నిహారిక వెళ్లి ఆడిషన్స్‌ ఇవ్వడంతో పాటు టెస్ట్‌ షూట్‌లో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Bollywood, Enter Bollywood, Nikharikha Web, Web Latest-Movie

  ప్రస్తుతం బాలీవుడ్‌లో వెబ్‌ సిరీస్‌ల జోరు కూడా కొనసాగుతుంది.అందుకే అక్కడ కూడా ఈ అమ్మడికి ఛాన్స్‌లు దక్కే అవకావం ఉందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.నిహారిక నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవాలని తాపత్రయ పడుతూ వస్తుంది.ఈ అమ్మడు హీరోయిన్‌గా సెటిల్‌ అవ్వకున్నా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరు దక్కించుకోవాలని ఆశ పడుతుంది.

మరి ఈమె ఆశ ఏమేరకు నెరవేరుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube