విశాఖ గర్జనపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన ట్వీట్

విశాఖ గర్జన కార్యక్రమంపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సంచలన ట్వీట్ చేశారు.విశాఖను మీరు రాజధాని చేయడం ఏంట్రా బాబు అన్న ఆయన.

విశాఖ ఆల్ రెడీ రాజధానికి అమ్మమొగుడు లాంటి సిటీ అని ట్వీట్ లో పేర్కొన్నారు.వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండి అంటూ ట్వీట్ చేశారు.

అయితే, వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ కలిసి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖ గర్జన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.మరోవైపు విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో నాగబాబు ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు