వరుణ్ తేజ్, నిహారిక విషయంలో తప్పు చేశానంటున్న నాగబాబు..?  

మెగాబ్రదర్, నటుడు, నిర్మాత నాగబాబు “మన ఛానల్ మన ఇష్టం” యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ అంశాల గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా నిహారిక, వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ నాగబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

TeluguStop.com - Mega Brother Nagababu Says His Relation With Varun Tej And Niharika

తన కుటుంబ విషయాల గురించి తొలిసారి యూట్యూబ్ ఛానల్ లో నాగబాబు మాట్లాడారు.వరుణ్, నిహారికల విషయంలో తాను తప్పు చేశానని నాగబాబు అన్నారు.

నాగబాబు వీడియోలో తాను గొప్ప కమ్యూనికేటర్ ను అని ఎప్పుడూ అనుకోనని అయితే అంతోఇంతో బెటర్ కమ్యూనికేటర్ నే అని అన్నారు. నిహారిక, వరుణ్ లకు అనేక విషయాలను వివరించి అర్థమయ్యేలా చెప్పేవాడినని తెలిపారు.

TeluguStop.com - వరుణ్ తేజ్, నిహారిక విషయంలో తప్పు చేశానంటున్న నాగబాబు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే కొన్ని సందర్భాల్లో కోపం వస్తే నిహారిక, వరుణ్ లను కొట్టేవాడినని అలా తాను కొట్టడం కరెక్ట్ కాదని అన్నారు.తనకు నిహారిక, వరుణ్ లను తిట్టిన, కొట్టిన సమయంలో మెచ్యూరిటీ లేదని అందుకే ఆ సమయంలో అలా చేశానని వెల్లడించారు.

తల్లిదండ్రులు పిల్లలకు ఏ విషయం గురించైనా అర్థమయ్యేలా చెప్పాలే తప్ప కొట్టకూడదని అన్నారు.తాను ఒక విషయాన్ని పిల్లలకు చెప్పదలచుకున్నానని పిల్లలు తల్లిదండ్రులతో ఫ్రీగా ఉంటూ అన్ని విషయాలను షేర్ చేసుకోవాలని సూచనలు చేశారు.

నిహారిక, వరుణ్ లతో కమ్యూనికేషన్ విషయంలో ఎలాంటి దాపరికాలను తాను పెట్టుకోలేదని.ఎలాంటి సమస్య వచ్చినా తాను తప్పకుండా సమస్యను అర్థం చేసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని అన్నారు.

భూప్రపంచంలో పిల్లల కంటే విలువైన వాళ్లు ఇంకెవరూ లేరని వాళ్లతో చెప్పానని తెలిపారు.పిల్లల ఇష్టాలకు అనుగుణంగానే కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించానని అన్నారు.వరుణ్ సినిమాల్లోకి వెళతానని చెప్పిన సమయంలో కష్టపడమని, హార్డ్ వర్క్ చేయమని సూచించానని.సక్సెస్ కాకపోతే నిరాశ చెందవద్దని సూచించానని తెలిపారు.నిహారిక, వరుణ్ సక్సెస్ అయినా కాకపోయినా సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని అన్నారు.

#RelationWith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు