'మా' సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం మెగా బ్రదర్ నాగబాబు తన మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య మా అధ్యక్ష పదవి పోటీ జరిగింది.

 Nagababu Announces Resignation To Maa Membership, Maa Membership, Mega Brother N-TeluguStop.com

మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు.ప్రకాష్ రాజ్ ఓటమిని అంగీకరించలేకే నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారని చెప్పొచ్చు.

నాగబాబు తన ట్విట్టర్ లో ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్త్వత్వంతో కొట్టు మిట్టులడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేక మా అసోసియేషన్ లో తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు నాగబాబు.

మంచు విష్ణు గెలిచిన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగింది చాలు.

ఇక మీదట అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని అన్నారు.అయితే మంచు విష్ణు గెలవడాన్ని యాక్సెప్ట్ చేయలేకనే నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారని చెప్పుకోవచ్చు.

మరి ఈ విషయం ఎలా టర్న్ అవుతుంది అన్నది చూడాలి. ప్రస్తుతం అయితే నాగబాబు మా మెంబర్షిప్ కు రిజైన్ చేయడంపై అందరు షాక్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube