మనస్సు మార్చుకున్న నాగబాబు.. మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ..?

దాదాపు ఏడు సంవత్సరాల పాటు జబర్దస్త్ షోకు నాగబాబు జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.జబర్దస్త్ షో ఒక రేంజ్ లో సక్సెస్ కావడానికి నాగబాబు కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

 Mega Brother Nagababu Participating In Zee Telugu Ugadi Event-TeluguStop.com

అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ షోకు, ఈటీవీ ఛానెల్ కు దూరమైన నాగబాబు ఆ తరువాత జీ తెలుగు ఛానల్ లో అదిరింది, బొమ్మ అదిరింది షోలకు జడ్జిగా వ్యవహరించడంతో పాటు జీ తెలుగు నిర్వహించే పలు ఈవెంట్లలో పాల్గొని సందడి చేశారు.

జబర్దస్త్ షో రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటుంటే అదిరింది, బొమ్మ అదిరింది షోలు మాత్రం వేర్వేరు కారణాల వల్ల హిట్ కాలేదు.

 Mega Brother Nagababu Participating In Zee Telugu Ugadi Event-మనస్సు మార్చుకున్న నాగబాబు.. మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత యూట్యూబ్ లో ఖుషీఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు సినిమాలతో కూడా బిజీ అవుతున్నారు.అయితే గత కొన్ని నెలల నుంచి బుల్లితెరకు దూరంగా ఉన్న నాగబాబు మళ్లీ జీ తెలుగు ఛానల్ లో ఎంట్రీ ఇచ్చారు.

ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకు టీవీ ఛానెళ్లు ఈవెంట్లను నిర్వహిస్తుండగా జీ తెలుగు ఛానల్ “ఉమ్మడి కుటుంబంలో కమ్మటి భోజనం” పేరుతో ఒక ఈవెంట్ ను ప్రసారం చేస్తోంది.నాగబాబు, నిహారిక, మంచు లక్ష్మిలతో పాటు మరి కొంతమంది సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా హాజరయ్యారు.జీ తెలుగు ఈవెంట్ లో ప్రత్యక్షమైన నాగబాబు మళ్లీ ఏదైనా షోకు జడ్జిగా వ్యవహరిస్తారేమో చూడాల్సి ఉంది.

మరోవైపు ఈ మధ్య కాలంలో నాగబాబు ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

నెటిజన్లు లైవ్ చాట్ లో అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇస్తున్నారు.నాగబాబు ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

#Manchu Laxmi #Niharika #Ugadi Sepcial #NagababuOn #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు