నర్సాపురం బరిలో 'మెగా బ్రదర్' ఎంపీగా పోటీ ?

ఒక్కో సీటు విషయంలో క్లారిటీ ఇస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైనల్ లిస్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.తమ్ముడు పార్టీకి ఉడతాభక్తిగా సహాయం అందిస్తున్న ఆయన అన్నయ్య నాగబాబు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్దమే అన్నట్టుగా సంకేతాలు కొంతకాలంగా ఇస్తూనే ఉన్నాడు.

 Mega Brother Nagababu Participating From Narsapuram As Janasena Mp-TeluguStop.com

గతంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్దలు వచ్చాయని వార్తలు వినిపించాయి.కానీ కొంత కాలంగా తమ్ముడు పవన్ కల్యాణ్ విషయంలో ఏ చిన్న సంఘటన జరిగినా మెగా బ్రదర్ నాగబాబు చాలా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాడు.

సినిమాల్లో కోట్ల రూపాయల సంపాదన వదులుకుని మరీ ప్రజల కోసం కష్టపడుతున్నాడు అంటూ సానుభూతి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.తన సొంత యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా జనసేనకు మైలేజ్ పెంచుతూ, ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ పవన్ కి అన్నిరకాల సపోర్ట్ అందిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలో నాగబాబు అధికారంగా చేరుతున్నారు.నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి నాగ బాబు పోటీ చేయబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.పవన్ ఇప్పటికే రెండు సీట్లలో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాడు.నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న భీమవరం నియోజకవర్గంలోనే పవన్ పోటీ చేయబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల గుంటూరు సభలో కార్యకర్తల సమావేశంలో నాగబాబు హాజరైన విషయం తెలిసిందే.కొంత కాలంగా పార్టీకి సంబంధించిన మీటింగ్స్ లో పాల్గొంటున్నారు.నరసాపురం నుంచి ఇప్పటికే టీడీపీ తరపున ఉండి సిట్టింగ్ ఎమ్యెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పోటీ చేయబోతుండగా, వైసీపీ నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజు బరిలో ఉన్నారు.వీరిద్దరూ క్షత్రియ సామజిక వర్గానికే చెందినవారు కాగా జనసేన నుంచి కాపు సామజిక వర్గానికి చెందిన వారిని రంగంలోకి దించితే బాగుంటుందని పవన్ భావిస్తున్నాడట.

ఈ నేపథ్యంలోనే నాగబాబు పేరు పరిశీలనలోకి వచ్చిందట.ఇక నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే మత్సకార సామజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ ను జనసేన అభ్యర్థిగా రంగంలోకి దింపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube