కూతురి ఎంగేజ్మెంట్ వీడియోను విడుదల చేసిన మెగా బ్రదర్...!

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్లు, నిశ్చితార్థం సీజన్ కొనసాగుతోంది.ఆగస్టు 16 నుండి ముహూర్తాలు ఏకంగా 80 రోజుల పాటు లేకపోవడంతో చాలామంది పెళ్లిళ్లు చేసుకోవాల్సిన టాలీవుడ్ ప్రముఖ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు అని తేడా లేకుండా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.

 Mega Brother Nagababu Daughter Engagement Video,engagement, Mega Family, Nagabab-TeluguStop.com

తాజాగా ఇదే క్రమంలో మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కూడా జరిగింది.తాజాగా కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో వెంకట చైతన్య జొన్నలగడ్డ, కొణిదెల నిహారిక నిశ్చితార్థ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఇక ఈ కార్యక్రమంలో కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ తప్పించి మిగతా వారందరూ హాజరయ్యారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.

ఈ కార్యక్రమానికి సంబంధించి తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుమార్తె నిశ్చితార్థ ఈ వీడియోను విడుదల చేశాడు.ఇక ఈ వీడియోలో తన కూతురు నిశ్చితార్థనికి సంబంధించిన ఫోటోలతో కలిపి తయారు చేసిన వీడియో ను రూపొందించారు.

ఇక ఇక వీరి వివాహం విషయానికి వస్తే… ఇంకా కచ్చితమైన పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు.అతి త్వరలోనే అఫీషియల్ గా వీరి వివాహ తేదీ లను ప్రకటించనున్నారు.రాబోయే కార్తీకమాసం లేదా మార్గశిర మాసంలో వీరి వివాహం జరిగే సూచనలు కనబడుతున్నాయి.ఇక పెళ్లి కుమారుడు చైతన్య జొన్నలగడ్డ విషయానికి వస్తే ఈయన గుంటూరు జిల్లా రేంజ్ ఐజి కుమారుడు.

ప్రస్తుతం ఈయన ఓ ఐటీ కంపెనీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.రోజుల క్రితం జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలలో అతనిని చూస్తే అతి త్వరలో వెండి తెరపై ఈయన కూడా హీరోగా పరిచయమైన ఎటువంటి అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube