నాగబాబును వెంటాడిన దురదృష్టం.. అందుకే ఛాన్స్ మిస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, పలు కామెడీ షోలకు జడ్జిగా, జనసేన నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగబాబు. అయితే నటుడిగా, జడ్జిగా సక్సెస్ అయిన నాగబాబు నిర్మాతగా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.

 Mega Brother Nagababu Missing To Producer Power Star Pawan Kalyan Gabbar Singh M-TeluguStop.com

అంజనా ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ స్థాపించి నాగబాబు ఆ బ్యానర్ పై కొన్ని సినిమాలను నిర్మించగా వాటిలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్నాయి.

నాగబాబు రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారూ బాగున్నారా, గుడుంబా శంకర్, స్టాలిన్ సినిమాలను నిర్మించగా వీటిలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా భారీ నష్టాలు మాత్రం రాలేదు.

అయితే రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మాతగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమా మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో పాటు నాగబాబును తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది.

ఆ సినిమా తరువాత నాగబాబు సోలో నిర్మాతగా మరే చిత్రం తెరకెక్కలేదు.

ఆరెంజ్ ఫ్లాప్ తరువాత టీవీ రంగంపై దృష్టి పెట్టిన నాగబాబు జబర్దస్త్, బొమ్మ అదిరింది షోలకు జడ్జిగా వ్యవహరించి పేరు, గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆర్థికంగా స్థిరపడ్డారు.ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాగబాబును ఆదుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి.

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరోగా నటిస్తున్న సమయంలో ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని నాగబాబుకు సూచించారట.అయితే ఆరెంజ్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోవడం, పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉండటం, హరీష్ శంకర్ కు కూడా డైరెక్టర్ గా పెద్దగా గుర్తింపు లేకపోవడంతో నాగబాబు గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించడానికి వెనుకడుగు వేశారని.

ఆ విధంగా నాగబాబును దురదృష్టం వెంటాడిందని సమాచారం.ఒకవేళ గబ్బర్ సింగ్ సినిమాను నాగబాబు నిర్మించి ఉంటే మాత్రం ఆరెంజ్ సినిమా వల్ల వచ్చిన నష్టాలన్నీ భర్తీ కావడంతో పాటు నాగబాబుకు భారీగా లాభాలు వచ్చేవని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Gabbar singh movie ,Mega Brother Nagababu ,orange movie, Powerstar Pawan Kalyan,Bommarillu Bhaskar,

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube