జబర్దస్త్ షోకు అందుకే దూరమయ్యా.. సీక్రెట్ చెప్పేసిన నాగబాబు..?

సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకుల ఆదరణ వల్ల మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న షోలలో జబర్దస్త్ ఒకటి.ఈటీవీ ఛానెల్ లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ పేర్లతో ఈ షోలు ప్రసారమవుతుండగా రెండు షోలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.

 Mega Brother Nagababu Clarity About Jabardasth Show Exit-TeluguStop.com

అయితే ఒకప్పుడు ఈ షోకు రోజా, నాగబాబు జడ్జీలుగా వ్యవహరించగా ఇప్పుడు ఈ షోకు రోజా, మనో జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

వేర్వేరు కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ షోకు దూరం కాగా గతంలో కొన్ని వీడియోలు చేసి నాగబాబు జబర్దస్త్ షోకు దూరం కావడానికి కొంతమేర స్పష్టతనిచ్చారు.

 Mega Brother Nagababu Clarity About Jabardasth Show Exit-జబర్దస్త్ షోకు అందుకే దూరమయ్యా.. సీక్రెట్ చెప్పేసిన నాగబాబు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా నెటిజన్ల నుంచి జబర్దస్త్ షోకు సంబంధించి, జబర్దస్త్ షోకు రీఎంట్రీకి సంబంధించి ప్రశ్నలు ఎదురు కాగా నాగబాబు ఆ ప్రశ్నలకు స్పందించి స్పష్టతనిచ్చారు.మల్లెమాల వాళ్లతో సైద్ధాంతికపరమైన విభేదాల వల్లే జబర్దస్త్ షోకు దూరమయ్యానని నాగబాబు చెప్పుకొచ్చారు.

Telugu Bomma Adirindhi, Differences With Mallemala, Jabardasth Show Exit, Khushi Khushiga, Megabrother Nagababu, Nagababu Clarity, Nagababu Favorite Show, Roja And Mano, Roja And Nagababu-Movie

ఒక నెటిజన్ జబర్దస్త్ లేదా అదిరింది షోలలో ఫేవరెట్ షో ఏదని ప్రశ్నించగా నాగబాబు బొమ్మ అదిరింది అంటూ సమాధానం ఇచ్చారు.జబర్దస్త్ షోను వీడటానికి అసలైన కారణాన్ని నాగబాబు చెప్పకనే చెప్పేశారు.మరో నెటిజన్ జబర్దస్త్ నిర్వాహకులు అడిగితే మీరు మళ్లీ జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇస్తారా.? అని ప్రశ్నించగా ఆ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదని నాగబాబు తేల్చి చెప్పడం గమనార్హం.

మరోవైపు నాగబాబు జీ తెలుగు ఛానల్ లోనే భవిష్యత్తులో జరగబోయే ప్రోగ్రామ్స్ కు జడ్జిగా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయి.నాగబాబు యూట్యూబ్ లో ఖుషీ ఖుషీగా అనే స్టాండప్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించగా ఆ షో సీజన్ 1 తాజాగా పూరైంది.

రాబోయే రోజుల్లో ఖుషీ ఖుషీగా సీజన్ 2 ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

#Khushi Khushiga #JabardasthShow #Roja And Mano #DifferencesWith #Bomma Adirindhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు